ETV Bharat / sitara

నానికి బర్త్​డే గిఫ్ట్.. పెళ్లి కష్టాలపై శర్వానంద్ సాంగ్

author img

By

Published : Feb 23, 2022, 4:13 PM IST

Updated : Feb 23, 2022, 4:22 PM IST

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అంటే సుందరానికి, ఆడవాళ్లు మీకు జోహార్లు, దొంగలున్నారు జాగ్రత్త, నేను మీకు బాగా కావాల్సినవాడిని, ఝండ్ సినిమాలతో పాటు ద గ్రేట్ ఇండియన్ కిచెన్ హిందీ రీమేక్​కు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

nani sharwanand new movies
నాని శర్వానంద్ న్యూ మూవీస్

Nani ante sundaraniki movie: యువ కథానాయకుడు నాని పుట్టినరోజు గురువారం(ఫిబ్రవరి). ఈ క్రమంలోనే అతడు హీరోగా నటిస్తున్న 'అంటే సుందరానికి' టీమ్.. 'బర్త్​డే హోమమ్' పేరుతో హాస్యభరితంగా ఉన్న ఓ వీడియోను​ రిలీజ్ చేసింది. జూన్ 10న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో నాని, బ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్నారు. అతడి సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ హీరోయిన్​గా చేస్తుంది. వివేక్ సాగర్ సంగీతమందిస్తుండగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

Adavallu meeku joharlu songs: కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించినప్పుడు సగటు యువకుడి పరిస్థితి ఎలా ఉంటుందో పాట రూపంలో వినిపించారు నటుడు శర్వానంద్‌. అతడు హీరోగా నటించిన కొత్త సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఇందులో 'మాంగళ్యం తంతునా..' అంటూ సాగే లిరికల్​ పాటను బుధవారం రిలీజ్ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో శర్వానంద్ సరసన రష్మిక హీరోయిన్​గా నటించింది. మార్చి 4న చిత్రం, ప్రేక్షకుల ముందుకు రానుంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.

యువ కథానాయకుడు శ్రీసింహా కొత్త సినిమాకు 'దొంగలున్నారు జాగ్రత్త' టైటిల్​ నిర్ణయించడం సహా ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేశారు. సతీశ్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

.
.

'సెబాస్టియన్'గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న కిరణ్ అబ్బవరం.. హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' అనే టైటిల్​ను ఫిక్స్ చేశారు. ఫస్ట్​లుక్​ను బుధవారం రిలీజ్ చేశారు. ప్రీతి ఆస్రాని హీరోయిన్​గా చేస్తుండగా, కార్తిక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

.
.

The great indian kitchen hindi remake: బాలీవుడ్​ నుంచి కొత్త అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అమితాబ్​ బచ్చన్ 'ఝండ్' ట్రైలర్​ ఉంది. ఈ సినిమా మార్చి 4న థియేటర్లలోకి రానుంది. మరోవైపు మలయాళంలో గతేడాది వచ్చి హిట్​గా నిలిచిన 'ద గ్రేట్​ ఇండియన్ కిచెన్' సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. సన్యా మల్హోత్రా టైటిల్​ రోల్ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఆర్తి కడవ్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
.
.

ఇవీ చదవండి:

Last Updated :Feb 23, 2022, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.