ETV Bharat / sitara

'పైరసీ నిర్మూలనకు పోరాటం చేస్తూనే ఉన్నా!'

author img

By

Published : Mar 25, 2021, 12:02 PM IST

పైరసీపై తమిళ కథానాయకుడు విశాల్​ అసహనం వ్యక్తం చేశారు. పైరసీ భూతాన్ని అరికట్టేందుకు తాను కొంతమంది యువకులతో ఎప్పుడో యాంటీ పైరసీ టీమ్ ఏర్పాటు చేసినట్టు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్​ గుర్తుచేశారు.

Kollywood Hero Vishal Opens Up On His Bollywood Debut
'పైరసీ నిర్మూలనకు పోరాటం చేస్తూనే ఉన్నా!'

సినిమాల ఆన్‌లైన్‌ పైరసీపై కథానాయకుడు విశాల్‌ అసహనం వ్యక్తం చేశారు. 'ఎనిమీ', 'డిటెక్టివ్-2' చిత్రీకరణలో బిజీగా ఉన్న విశాల్‌.. ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ఈ సమయంలో తన బాలీవుడ్‌ ఎంట్రీపై స్పందించారు. అలాగే దక్షిణాది చిత్రాలు బాలీవుడ్‌లోకి.. బీటౌన్‌ సినిమాలు ఇక్కడికి రీమేక్‌ కావడంపై విశాల్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"బాలీవుడ్‌ ఎంట్రీ గురించి ఇప్పుడే చెప్పలేను. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తా. అలాగే, ఏ సినిమాకైనా కథే హీరో. కథ బాగుంటే ఏ భాషా చిత్రానైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. లాక్‌డౌన్‌ కారణంగా కాస్త విరామం దొరకడం వల్ల దక్షిణాది, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా అన్ని భాషా సినిమాలను చాలామంది వీక్షించారు. ఈ క్రమంలోనే రీమేక్‌ల పరంపర కొనసాగుతోంది. దక్షిణాది చిత్రాల్లోని కథ, స్క్రీన్‌ప్లే.. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే, మనం ఎన్నో సౌత్‌ ఇండియన్‌ చిత్రాల రీమేక్స్‌ చూస్తున్నాం."

- విశాల్​, కథానాయకుడు

పైరసీని అరికట్టేందుకు తాను కొంతమంది యువకులతో యాంటీ పైరసీ టీమ్ ఏర్పాటు చేసినట్టు హీరో విశాల్​ వెల్లడించారు. "బిగ్‌స్క్రీన్‌ల్లోకి రాకముందే పలు చిత్రాలను ఆన్‌లైన్‌లో పైరసీ చేసేస్తున్నారు. అసలు ఈ సమస్యకు ఎవరిని నిందించాలో మీకు తెలుసా? సినిమా సంస్థలు, ప్రభుత్వ సైబర్ సెల్. ఎంతో కాలం నుంచి నేను పైరసీపై పోరాటం చేస్తున్నాను. దానిని రూపుమాపడానికి ఇప్పటికే కొంతమంది యువకులతో యాంటీ పైరసీ టీమ్‌ నిర్మించాను" అని విశాల్‌ వివరించారు.

ఇదీ చూడండి: 'ఏవో ఏవో కలలే' లిరికల్​ వీడియో.. 'రిపబ్లిక్​' ఫస్ట్​లుక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.