ETV Bharat / sitara

Sita-The Incarnation Movie: 'సీత' పాత్రలో కంగనా రనౌత్​

author img

By

Published : Sep 14, 2021, 7:34 PM IST

Updated : Sep 14, 2021, 7:46 PM IST

'బాహుబలి' రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్​ నుంచి వస్తోన్న కొత్త కథ 'సీత'(Sita- The Incarnation Movie). అలౌకిక్​ దేశాయి దర్వకత్వం వహిస్తున్నారు. ఇందులో సీత పాత్రధారిగా బాలీవుడ్​ క్వీన్​ కంగనా రనౌత్​(Kangana Sita) నటించనున్నారు. ఇదే విషయాన్ని నిర్మాణసంస్థ అధికారికంగా ప్రకటించింది.

Kangana Ranaut to headline period drama 'The Incarnation - Sita'
Sita-The Incarnation Movie: 'సీత' పాత్రలో కంగనా రనౌత్​

'బాహుబలి', 'తలైవి' వంటి చిత్రాలకు కథను అందించిన సినీ రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్.. కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న కొత్త చిత్రం 'సీత: ది ఇంకార్నేషన్‌'(Sita-The Incarnation Movie). అలౌకిక్‌ దేశాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సీత పాత్ర కోసం బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ను(Kangana Sita) ఎంపిక చేసినట్లు చిత్రబృందం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాలో రావణుడి పాత్రపై రణ్‌వీర్‌ మనసు పడ్డాడని ఇటీవలే ప్రచారం జరిగింది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది.

'సీత' సినిమాను ఏ హ్యూమన్‌ బీయింగ్‌ స్టూడియో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తుండగా మనోజ్‌ ముంతాషీర్‌ సాహిత్య, సంభాషణలు సమకూరుస్తున్నారు. పూర్తిస్థాయి వీఎఫ్​ఎక్స్ సాంకేతికతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటివరకు ఎవరూ చూడని, ఎవరికీ తెలియని సరికొత్త 'సీత'ను ఈ సినిమా ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేయనున్నారు.

Kangana Ranaut to headline period drama 'The Incarnation - Sita'
కంగనా రనౌత్​

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా రూపొందిన 'తలైవి' చిత్రంలో(Kangana Thalaivi Movie) కంగనా టైటిల్​ రోల్ పోషించింది. ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంటోంది. ఆమె ప్రస్తుతం 'ధాకడ్​', 'తేజస్​' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇదీ చూడండి.. PelliSandaD Teaser: 'పెళ్లిసందD' మామూలుగా లేదు!

Last Updated :Sep 14, 2021, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.