ETV Bharat / sitara

'హీరో సూర్య వల్లే నా గురించి పదిమందికీ..'

author img

By

Published : Aug 23, 2021, 6:43 AM IST

'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో ప్రేక్షకుల ముందు త్వరలో రానున్న దర్శకుడు దర్శన్.. చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత అంశాల్ని చెప్పారు. తాను డైరెక్టర్​గా మారడానికి సూర్యనే ప్రధాన కారణమని అన్నారు.

ichata vahanamulu nilupa radu director darshan
డైరెక్టర్ దర్శన్

"జీవితంలో చాలా విషయాల్ని మనం చిన్నవిగా చూస్తుంటాం. కానీ అవే అప్పుడప్పుడు పెద్ద ప్రభావం చూపిస్తాయి. ఆ విషయాన్ని మాదైన శైలిలో చెప్పడం సహా.. మంచి థ్రిల్లింగ్‌ అనుభూతిని ప్రేక్షకులకు పంచేలా చిత్రాన్ని తీర్చిదిద్దాం" అని అన్నారు దర్శకుడు ఎస్‌.దర్శన్‌. ఆయన తెరకెక్కించిన చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. సుశాంత్‌ కథానాయకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్‌ కోయలగుండ్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శన్‌ ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

.
.

"చెన్నైలో నాకు... నా స్నేహితుడికి ఎదురైన కొన్ని సంఘటనల్లో ఒక అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించా. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తోపాటు... కామెడీ, రొమాన్స్‌, యాక్షన్‌ అంశాల మేళవింపు చక్కటి వినోదం పంచుతుంది. సుశాంత్‌ ఆర్కిటెక్చర్‌గా పనిచేసే ఓ మధ్య తరగతి కుర్రాడిగా కనిపిస్తాడు. ఆ ఆఫీస్‌లోనే పనిచేసే అమ్మాయిగా కథానాయిక మీనాక్షి చౌదరి కనిపిస్తుంది".

.
.

* "దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి దగ్గర 'ఢమరుకం'తో పాటు మరో సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశా. ఆయన ఇచ్చిన ప్రోత్సాహ మరువలేనిది. నేను తెలుగు నేర్చుకున్నది 'ఢమరుకం' సెట్‌లోనే. మా నాన్న కేశవ్‌ తమిళంలో పేరున్న రచయిత. కె.ఎస్‌.రవికుమార్‌, పాండిరాజ్‌ దగ్గర రచనా విభాగంలో పనిచేశారు.

* "దర్శకుడిగా అడుగులు వేయడానికి నాకు కావల్సినంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది కథానాయకుడు సూర్య. నేను రాసుకున్న కథ విషయంలో తొలి మెప్పు ఆయన నుంచే వచ్చింది. ఆయన 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణ సంస్థను ప్రారంభించినప్పుడు జరిపిన టాలెంట్‌ హంట్‌ కోసం నేను నా స్క్రిప్ట్‌ను పంపించా. ఎంపికైంది . మరోసారి కథ విని బాగుందని మెచ్చుకున్నారు. నా గురించి పదిమందికి తెలిసిందంటే కారణం సూర్యానే. ప్రతిభను ప్రోత్సహించడం కోసమే సూర్య అప్పట్లో అలా ప్రచారం చేశారు".

* "ప్రముఖ నటి భానుమతి రామకృష్ణ మనవడు రవిశంకర్‌ శాస్త్రి వారి నిర్మాణ సంస్థను కొనసాగించడం కోసం చాలా కథలు విని ఎంపిక చేసుకుని తీసిన సినిమా ఇది. ఆయన సింగపూర్‌లో ఉన్నా హరీష్‌ అన్ని బాధ్యతల్ని చూసుకుంటూ పూర్తి చేశారు. భిన్న రకాల కథలు చేయడమంటే ఇష్టం. తదుపరి సినిమా కోసం కథలు సిద్ధంగా ఉన్నాయి".

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.