ETV Bharat / sitara

నా సినిమాలు చూడటానికి సిగ్గుపడుతుంటా: సూర్య

author img

By

Published : Feb 7, 2021, 5:25 PM IST

తన సినిమాల గురించి క్రేజీ విషయాల్ని చెప్పిన సూర్య.. వాటిని చూసేందుకు చాలా సిగ్గుపడుతుంటానని చెప్పారు. చేసే పనిని పూర్తి ఇష్టపడతానని అన్నారు.

I sometimes shy away from watching my own films: Suriya
సూర్య

కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ ఎంతోమంది అభిమానుల్ని పొంది.. ఇక్కడ కూడా మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు ప్రముఖ నటుడు సూర్య. ఎయిర్‌డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీ.ఆర్‌. గోపీనాథ్‌ బయోపిక్​ 'ఆకాశం నీ హద్దురా!'తో ఇటీవల మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలోని సూర్య నటన చూసి అందరూ ప్రశంసిస్తున్నారు.

అయితే తన నటన, సినిమాల గురించి సూర్య ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన చిత్రాలు త్వరగా చూడనని అన్నారు. 'నేను కథానాయకుడిగా నటించిన సినిమాలు చూడడానికి చాలా సిగ్గు పడుతుంటాను. సినిమా విడుదలై వందరోజులయ్యాకే.. ఆ చిత్రాన్ని వీక్షించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను నటించిన చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తే చూసి ఎంతో ఆనందిస్తుంటాను. 'ఇది నా అభిమాన చిత్రం' అని అప్పుడు చెబుతుంటాను. నా భార్య జ్యోతిక, నా తమ్ముడు కార్తి ఇద్దరూ ఇండస్ట్రీకి చెందినవారే. కానీ వాళ్లిద్దరూ నాలా ఉండరు. వాళ్లు చేసే పనిపై పూర్తి నమ్మకంతో ఉంటారు. చేసే పనిని పూర్తిగా ఇష్టపడి చేస్తారు'

'కొన్నిసార్లు నా పనిని నేను విమర్శించుకుంటాను. కొన్నిసార్లు నటుడిగా నా బెస్ట్‌ ఇవ్వలేదనుకుంటాను. ఇంకా బాగా వర్క్‌చేయాలని భావిస్తుంటాను' అని సూర్య ఈ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇది చదవండి: ఆస్కార్​ రేసులో సూర్య 'సూరరై పొట్రు'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.