ETV Bharat / sitara

'టక్​ జగదీష్​' ఓటీటీ రిలీజ్​ అప్పుడేనా?

author img

By

Published : Aug 17, 2021, 9:03 AM IST

'టక్​ జగదీష్'​ చిత్రం విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి ఇప్పటికే డీల్​ కుదరగా.. వినాయక చవితి సందర్భంగా రిలీజ్​ చేయడానికి చిత్రబృందం యోచిస్తున్నట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ​

Tuck Jagadish
టక్ జగదీష్

నేచురల్​ స్టార్​ నాని హీరోగా నటించిన 'టక్​ జగదీష్' చిత్రం ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్​ ప్రైమ్​తో చిత్రబృందం ఒప్పందం కుదుర్చుకుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు తీసుకున్నరానున్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సంస్థతో 'టక్​ జగదీష్' నిర్మాతలు రూ.37 కోట్లకు డీల్‌ కుదుర్చుకున్నట్లు సమాచారం. శాటిలైట్‌, హిందీ అనువాద హక్కులు కలుపుకొంటే రూ.50 కోట్లపైగానే ఈ సినిమా వ్యాపారం చేసినట్టవుతుందన్న మాట. శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రమిది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించారు. రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్‌ నాయికలు నటించారు.

ఇదీ చదవండి: కాజల్​ ఫిట్​నెస్​ సీక్రెట్​ తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.