ETV Bharat / sitara

'భీమ్లానాయక్'​ సర్​ప్రైజ్.. డిసెంబర్ 31 రాత్రి పూనకాలే!

author img

By

Published : Dec 29, 2021, 12:29 PM IST

Bheemla Nayak Latest Update: నూతన సంవత్సరం సందర్భంగా అభిమానుల్లో మరింత జోష్​ను నింపేందుకు సిద్ధమవుతున్నారు పవర్​స్టార్ పవన్ ​కల్యాణ్. డిసెంబర్​ 31న 'భీమ్లానాయక్​'లోని 'లాలాభీమ్లా డీజే సాంగ్'​ను విడుదల చేయనుంది చిత్రబృందం.

bhimla nayak
భీమ్లా నాయక్

Bheemla Nayak Latest Update: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అభిమానులకు మరింత కిక్​ ఇచ్చేందుకు సిద్ధమైంది 'భీమ్లానాయక్' చిత్రబృందం. తాజాగా సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చింది. స్టార్​ హీరో పవన్​కల్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్క్రీన్​ప్లే- మాటలు అందిస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్.

డిసెంబర్ 31న సాయంత్రం 7.02 గంటలకు 'లాలా.. భీమ్లా డీజే సాంగ్'​ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. అయితే.. తొలుత విడుదలైన సాంగ్​ ఇప్పటికే అభిమానులను అలరిస్తోంది.

మలయాళ హిట్​ 'అయ్యప్పనుమ్ కోశియమ్' చిత్రానికి రీమేక్​గా 'భీమ్లా నాయక్'ను తెరకెక్కిస్తున్నారు. నిత్యామేనన్, సంయుక్త హీరోయిన్లు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకొంది. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది.

ఇదీ చదవండి:

Bheemla Nayak: రానాకు 'భీమ్లా నాయక్' సర్​ప్రైజ్​.. వీడియో అదుర్స్​!

వికారాబాద్​లో 'భీమ్లానాయక్'.. ఆ ఈవెంట్​కు చీఫ్ గెస్ట్​గా పవన్

మహేశ్​బాబు దంపతులకు పవన్​ కల్యాణ్ సర్​ప్రైజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.