వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం కేంద్రానికి చెందిన పాండు 62కు ఆదరణ లేక ఆకలితో అలమటించి రోడ్డుపై ఉన్న ఓ చెట్టు కింద తన తనువు చాలించాడు. తన భార్య, కుమారులు చనిపోయిన తరువాత ఉన్న ఇద్దరు బిడ్డలకు తన ఇంటిని అమ్మి వివాహం చేశాడు. తాను ఓ గుత్తేదారు దగ్గర వలస కూలీగా చేరి... జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు అక్కడ పనులు నిలిపివేయడం వల్ల చేసేది లేక గ్రామానికి రావలసి వచ్చింది. గ్రామంలో తనకంటూ ఎవరూ లేకపోవడంతో కొన్నాళ్లు బంధువుల ఇళ్లలో మరి కొన్నాళ్లు తన కూతురు ఇంట్లో కాలం గడిపాడు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉండడం వల్ల తమ బంధువులు, కూతుర్లు కరోనా ఉండడం వల్ల తనను దూరంగా ఉంచారు. చివరకు మళ్లీ తన సొంత గ్రామానికి చెరాడు. గ్రామంలోని ఓ చెట్టు కింద తల దాచుకుంటూ ఉన్నాడు. కరోనా వైరస్ ఉండటం వలన ఎవరు కూడా తనకు సహాయం చేయకపోగా... తన దగ్గరికి వచ్చేందుకు భయపడ్డారు. దీంతో ఆకలికి అలమటించి చివరకు గురువారం ప్రాణం విడిచాడు. తాను మరణించిన విషయం బంధువులకు తెలిపిన వారు అంతిమ సంస్కరణలకు కూడా ముందుకు రాలేదు. దీనితో గ్రామపంచాయతీ తరుఫున దహన సంస్కారాలు చేస్తామని కూతుళ్లకు సమాచారం ఇచ్చారు. స్పందించిన కూతుర్లు ఆమె తన తండ్రి అంతిమ సంస్కరణలు తామే చేస్తామని మృతదేహాన్ని తీసుకు వెళ్లారు. ఈ ఘటన చూపరులకు హృదయవిదారక సంఘటనగా మిగిలిపోయింది.
ఇదీ చూడండి : ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం