ETV Bharat / jagte-raho

కాలిన గాయాలతో ఆటోడ్రైవర్​... యాసిడ్​ దాడేనని అనుమానం

author img

By

Published : Sep 15, 2020, 4:44 PM IST

రోజూలాగే ఆటో తీసుకుని బయలుదేరిన ఆ వ్యక్తి కాలిన గాయాలతో రోడ్డుపై పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది యాసిడ్​ ఎటాకా... కాదా... అనేది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.

acid attack on auto driver in balapur
acid attack on auto driver in balapur

రంగారెడ్డి జిల్లా బాలపూర్ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఎర్రకుంటలో ఆటోడ్రైవర్​పై యాసిడ్ ఎటాక్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎర్రకుంటకు చెందిన అంజద్​ఖాన్ రోజూలానే ఆటో తీసుకొని వెళ్లగా... కొద్దిదూరంలో కాలిన గాయాలతో రోడ్డుపై పడి ఉన్నాడు. అంజద్​ఖాన్​కు ముఖం, కాలుపై తీవ్ర గాయాలయ్యాయి.

కుటుంబ సభ్యులు బాధితున్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. జరిగింది యాసిడ్ దాడేనా... కాదా.. అనేది దర్యాప్తులో తేలుతుందని బాలపూర్ పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: పోలీసు అధికారుల ఫొటోలతో సైబర్​ నేరగాళ్ల మోసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.