ETV Bharat / international

వలసదారుల పడవ బోల్తా.. భారతీయులు సహా 8 మంది మృతి

author img

By

Published : Apr 1, 2023, 9:56 AM IST

కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లేందుకు యత్నించిన 8 మంది మృతి చెందారు. నది దాటుతుండగా పడవ బోల్తా పడి మునిగిపోయారు. అయితే చనిపోయిన వారిలో భారతీయ కుటంబానికి చెందిన వ్యక్తులున్నారని అధికారులు వెల్లడించారు.

us boat accident
us boat accident

కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నించి నదిలో మునిగిపోయిన మరో ఇద్దరి మృతదేహాలను కెనడా- యూఎస్​ సరిహద్దులో శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు గురువారం ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. కాగా, చనిపోయిన వారిలో ఓ రొమేనియన్​ కుటుంబానికి చెందిన వ్యక్తులతో పాటు భారతీయులు కూడా ఉన్నారని శుక్రవారం అధికారులు వెల్లడించారు.

ఇదీ జరిగింది..
కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించి.. సెయింట్​ లారెన్స్​ నది దాటుతుండగా పడవ బోల్తా పడింది. అందులో ఉన్న ఓ రొమేనియన్​, ఒక భారతీయ కుటుంబానికి చెందిన వ్యక్తులున్నారు. పడవ బోల్తా గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఏరియల్​ సర్చ్​ చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకుని.. గురువారం ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ పడవ నడిపిన కేసీ ఓక్స్​(30) అనే వ్యక్తి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే, అతడు చనిపోయాడా లేక బతికే ఉన్నాడా అనే విషయం తెలియలేదని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి వాతావరణం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. వాతావరణం అనుకూలించకే పడవ బోల్తా పడిందా లేక.. ఇందులో ఏమైనా స్మగ్లర్ల హస్తం ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై కెనడా ప్రధానమంత్రి జస్టిన్​ ట్రూడో స్పందించారు. "ఇది హృదయ విదారక ఘటన. ముఖ్యంగా అందులో ఓ చిన్నారి ఉండటం బాధాకరం. ఇలా ఎందుకు జరిగిందో, ఎందుకు జరిగిందో.. ఇక ముందు ఇలాంటి ఘటనలు తగ్గించడానికి ఏం చేయాలో అనే విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది" అని జస్టిన్​ ట్రూడో అన్నారు.

చలికి గడ్డకట్టి.. నలుగురు భారతీయులు మృతి..
ఈ ఏడాది జనవరిలో ఇలాంటి ఘటనే జరిగింది. అమెరికా-కెనడా సరిహద్దుల్లో తీవ్రమైన మంచు తుపాను కారణంగా చలికి గడ్డకట్టుకుని ఓ చిన్నారి సహా నలుగురు భారతీయులు మృతి చెందారు. సరిహద్దుకు కొంత దూరంలో కెనడా వైపు నాలుగు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. సరిహద్దుకు 12 మీటర్ల దూరంలో మంచులో కూరుకుపోయి అత్యంత దారుణమైన స్థితిలో ఈ మృతదేహాలు కన్పించాయి. విపరీతమైన మంచు కారణంగా గడ్డకట్టుకుపోయి వీరంతా చనిపోయినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఆ తర్వాత దర్యాప్తు చేపట్టగా.. చనిపోయినవారు భారత్‌కు చెందిన పటేల్‌ కుటుంబంగా గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.