ETV Bharat / international

'జీరో కొవిడ్​'పై కఠినంగానే చైనా.. కేసులు స్వల్పంగా ఉన్నా తగ్గేదే లే!

author img

By

Published : Nov 5, 2022, 10:53 PM IST

కరోనా పుట్టినిల్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా జీరో కొవిడ్‌ విధానంతో కేసులను గణనీయంగా తగ్గించుకోంటోంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా నిబంధనలు తప్పక పాటించాలని చెబుతోంది.

china zero covid policy
చైనా జీరో కోవిడ్​ విధానం

ప్రపంచ దేశాలన్నీ కొవిడ్‌తో సహజీవనం చేస్తుంటే చైనా మాత్రం 'జీరో కొవిడ్‌' విధానాన్ని పాటిస్తూ తలుపులు మూసేసుకుంటోంది. ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నా, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నా నిబంధనలను మార్చేందుకు ససేమిరా అంటోంది. కరోనా ఆంక్షలతో ప్రముఖ సంస్థ ఉద్యోగులు గోడలు దూకి పారిపోతున్నప్పటికీ జీరో కొవిడ్‌ విధానం నుంచి వెనక్కి తగ్గేది లేదంటూ, డ్రాగన్ అధికారులు తేల్చిచెబుతున్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించి తీరాలని స్పష్టం చేస్తున్నారు.

కరోనా పుట్టినిల్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా జీరో కొవిడ్‌ విధానంతో యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కఠిన నిబంధనలు అమలు చేస్తూ, కేసులను గణనీయంగా తగ్గించుకోగల్గింది. అయితే గత కొన్ని నెలలుగా ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆయా దేశాలు కరోనా ఆంక్షలకు స్వస్థి పలికాయి. చైనా మాత్రం జీరో కొవిడ్ విధానం నుంచి వెనక్కి తగ్గడం లేదు. ఆంక్షలు సడలించాలని ప్రజలు వేడుకుంటున్నా డ్రాగన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా జీరో కొవిడ్ పాలసీ అమలు చేయనున్నట్లు చైనా అధికారులు మరోసారి స్పష్టం చేశారు.

ఇందుకు అనుగుణంగా పలు ప్రాంతాల్లో విధించిన కరోనా ఆంక్షలను కొనసాగిస్తున్నారు. చైనాలో ప్రయాణాలపై ఇప్పటికీ. అక్కడక్కడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. క్వారంటైన్‌లు, లాక్‌డౌన్లు విధిస్తున్నారు. ఆగ్నేయ చైనాలోని జెంగ్ ఝౌ నగరంలో తాజాగా బస్సు సర్వీసులు నిలిపివేశారు. సబ్‌వేలను మూసివేశారు.ప్రజలను ఇళ్లకే పరిమితం అవ్వాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. ఈ నగరంలో 18 లక్షల మందికి టెస్టులు నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా అవసరాల కోసం ఇంటికి ఒకరు మాత్రమే బయటకు రావాలని ఆంక్షలు విధిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.