ETV Bharat / international

'టీకాతీసుకున్న వారిలో ఆ ముప్పు అరుదే!'

author img

By

Published : Aug 12, 2021, 10:22 PM IST

కొవిడ్ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం చాలా అరుదని ఓ అధ్యయనం వెలువరించింది. ప్రతి 50 వేల మందిలో ఒకరు మాత్రమే మరణించే అవకాశాలు ఉన్నాయని.. అయితే అదీ అరుదేనని తెలిపారు.

VIRUS-UK-VACCINE-STUDY
VIRUS-UK-VACCINE-STUDY

ఆక్స్​ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ​తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం చాలా అరుదేనని బ్రిటన్​ శాస్త్రవేత్తలు తెలిపారు. టీకా తీసుకోవడం వలన కలిగే థ్రాంబోసైటోపెనియా, థ్రాంబోసిస్​(వీఐటీటీ)లపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, బ్రిటిష్ ఆరోగ్య సేవల(ఎన్​హెచ్​ఎస్) ఫౌండేషన్​లు సంయుక్తంగా ఓ పరిశోధన చేపట్టాయి. దీని పరిశోధనా పత్రం 'న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్'లో ప్రచురితమైంది.

వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం 220మందిలో తలెత్తిన లక్షణాలను పరిశీలించిన ఈ బృందం.. ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకుంటే రక్తం గడ్డకట్టే అవకాశాలు చాలా అరుదు అని పరిశోధనలో భాగమైన డాక్టర్ పావర్డ్ అన్నారు.

"రక్తం గడ్డకట్టే విషయాన్ని అర్థం చేసుకునేందుకు నిర్విరామంగా కృషి చేశాం. తద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా కొనసాగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిపై పోరులో అత్యంత కీలకమైన పరిష్కారం."

-డాక్టర్ పావర్డ్

50 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిలో(50వేల మందిలో) ఒకరు మరణించే అవకాశాలు ఉన్నట్లు ఆమె తెలిపారు. ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువ ఉన్నవారితో పాటు.. మెదడులో రక్తస్రావ సమస్య ఉన్నవారికి ఇది ప్రమాదకరమని చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.