ETV Bharat / international

అధ్యక్షుడిగా ట్రంప్ ఖాతాలో మరో చెత్త రికార్డు

author img

By

Published : Jan 19, 2021, 1:13 PM IST

అమెరికా అధ్యక్ష పదవిని వీడనున్న డొనాల్డ్​ ట్రంప్​ మరో చెత్త రికార్డును మూటగట్టున్నారు. ఆయన సరిగ్గానే బాధ్యతలు నిర్వర్తించినట్లు కేవలం 34 శాతం మంది అమెరికన్లే ఆమోదించారు. గ్యాలప్​ సంస్థ ఇందుకు సంబంధించిన రేటింగ్​ పోల్​ ఫలితాలను విడుదల చేసింది.

trump-receives-lowest-job-approval-rating-in-final-days-as-president
అధ్యక్షునిగా ట్రంప్ ఖాతాలో మరో చెత్త రికార్డు

మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్ష పదవిని వీడనున్నారు డొనాల్డ్​ ట్రంప్​. ఈ నేపథ్యంలో ఆయన పదవీ బాధ్యతలు ఏ మేరకు విజయవంతంగా నిర్వహించారనే విషయంపై గ్యాలప్ సంస్థ పోల్​ నిర్వహించింది. ఇందులో 34 శాతం మంది అమెరికన్లు మాత్రమే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించారని ఆమోదించారు. ఇందుకు సంబంధించిన పోల్​ ఫలితాలను గ్యాలప్​ విడుదల చేసింది. జనవరి 4నుంచి 15 మధ్య టెలిఫోనిక్​ ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ ఫలితాలు వెల్లడించింది. క్యాపిటల్​ భవనంలో హింస చెలరేగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ సర్వే ప్రారంభమైంది.

అయితే ట్రంప్​ నాలుగేళ్ల సగటును పరిశీలిస్తే 41 శాతం మంది ఆయన పాలనను ఆమోదించారు. ఇప్పటి వరకు మరే ఇతర అధ్యక్షుడికి ప్రజల నుంచి ఇంత తక్కువ అప్రోవల్​ రేటింగ్​ రాలేదు. నాలుగేళ్ల సగటు కనీసం 50శాతంగా ఉండేది. అప్రోవల్​ రేటింగ్ 50 శాతం దాటని మొదటి అధ్యక్షునిగా ట్రంప్​ నిలిచారు.

గ్యాలప్​ సంస్థ 1938 నుంచి అమెరికా అధ్యక్షుల అప్రోవల్ రేటింగ్​ పోల్​ను నిర్వహిస్తోంది. ఏబీసీ న్యూస్​ నిర్వహించిన పోల్​ ప్రకారం మెజారీటీ అమెరికన్లు ట్రంప్​ను పదవి నుంచి తప్పించాలని కోరుకుంటున్నారు.

ట్రంప్ అధ్యక్ష పదవీ కాలం బుధవారంతో ముగుస్తుంది. నూతన అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇదీ చూడండి: ప్రమాణస్వీకారోత్సవ విందులో కమలకు ఇష్టమైన 'గంబో'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.