ETV Bharat / international

ట్రంప్​కు తప్పిన ముప్పు.. విమానం అత్యవసర ల్యాండింగ్​!

author img

By

Published : Mar 10, 2022, 9:36 AM IST

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్​ చేయాల్సి వచ్చింది. విమానంలోని ఓ ఇంజిన్​ పనిచేయకపోవటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. గత శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు.

Trump plane
డొనాల్డ్​ ట్రంప్​

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇంజిన్​లో లోపం వల్ల ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని న్యూ ఓర్లియాన్స్​లో అత్యవసరంగా దింపారు అధికారులు. మెక్సికో గగనతలం మీదుగా ప్రయాణిస్తున్న క్రమంలో ఇంజిన్​ పనిచేయటం ఆగిపోయిందని, అందుకే అత్యవసరంగా న్యూ ఓర్లియన్స్​లో ల్యాండ్ చేయాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన గత వారాంతంలో జరిగింది.

ట్రంప్​ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్​ అయిన విషయాన్ని తొలుతో పొలిటికో వార్తాసంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు ధ్రువీకరించారు. అయితే.. ఆ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించలేదు.

న్యూ ఓర్లియాన్స్​లో గత శనివారం జరిగిన రిపబ్లికన్​ నేషనల్​ కమిటీ డోనార్​ రీట్రీట్​కు హాజరై.. తిరిగి ఫ్లోరిడా ఎస్టేట్​కు వస్తున్న క్రమంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంజిన్​ ఆగిపోయింది. న్యూ ఓర్లియన్స్​ లేక్​ఫ్రంట్​ ఎయిర్​పోర్ట్​ నుంచి బయలు దేరిన తర్వాత సుమారు 120 కిలోమీటర్ల దూరంలో విమానంలోని ఓ ఇంజిన్​ పనిచేయటం ఆగింది. ట్రంప్​తో పాటు ఆయన సలహాదారులు, నిఘా విభాగం అధికారులు ఉన్నారు.

ఇదీ చూడండి: 'కుట్ర ప్రకారమే క్యాపిటల్​ దాడి- ట్రంప్​కు వ్యతిరేకంగా సాక్ష్యాలు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.