ETV Bharat / international

Fetus Inside Liver: లివర్​లో గర్భం దాల్చిన మహిళ- వైద్యులు షాక్​

author img

By

Published : Dec 18, 2021, 5:44 PM IST

Fetus Inside Liver: సాధారణంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు గర్భాశయంలో పిండం ఏర్పడుతుంది. కానీ కెనడాలో ఓ మహిళ లివర్​లో పిండాన్ని గుర్తించి వైద్యులు షాక్ అయ్యారు. ఇలా అత్యంత అరుదుగా జరుగుతుందని తెలిపారు. ఆమెకు చికిత్స అందించారు.

Fetus inside liver, లివర్​లో గర్భం
లివర్​లో గర్భం దాల్చిన మహిళ

Fetus inside liver: మహిళల జీవితంలో గర్భధారణ సమయం అత్యంత క్లిష్టమైన దశ. శిశువును 9 నెలలపాటు కడుపులో మోయడం అంటే మాటలు కాదు. ఒక్కోసారి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అయితే కెనడాలో మాత్రం ఓ మహిళ వినూత్న రీతిలో గర్భం దాల్చింది. ఆమెకు గర్భాశయంలో కాకుండా పిండం లివర్​లో అభివృద్ధి చెందింది.

రుతు రక్తశ్రావం అధికంగా అవుతుందని డాక్టర్​ను సంప్రదించినప్పుడు ఆమెకు ఈ విషయం తెలిసింది. పరీక్షలు చేసిన వైద్యులు కూడా రిపోర్టు చూసి షాక్ అయ్యారు. అయితే ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా జరుగుతుంటాయని చెప్పారు. ఫలదీకరణం చెందిన అండాలు గర్భాశయంలో కాకుండా పొరపాటున శరీరంలోని వేరేభాగంలో స్థిరపడటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని వివరించారు. సాధారణంగా ఇలా జరిగే అవకాశమే లేదన్నారు.

Ectopic pregnancy

శ్రీవైద్య నిపుణుడు డా.మైకేల్​ నార్వే ఈ విషయాన్ని తన టిక్​టాక్ ఖాతా ద్వారా వెల్లడించినట్లు డైలీ మెయిల్ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. లివర్​లో పిండం అభివృద్ధి చెందడం తెలిసి నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Canadian woman pregnancy

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) వివరణాత్మక నివేదిక ప్రకారం ఈ మహిళకు పీరియడ్​ తర్వాత 14 రోజుల పాటు రుతు రక్తస్రావం అయింది. దీనిపై వైద్యులను సంప్రదించగా.. ఇంటెన్సివ్ పరీక్షలు చేశారు. అనంతరం ఇది ప్రపంచంలోనే అత్యతం అరుదైన గర్భధారణ కేసులలో ఒకటని గుర్తించారు.

ఇదీ చదవండి: China Oldest Person: 135 ఏళ్ల చైనా బామ్మ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.