ETV Bharat / international

మనిషి దంతాలు, గొర్రె తలతో వింత చేప..!

author img

By

Published : Aug 8, 2021, 3:45 PM IST

దంతాలు ఉన్న చేపను మీరు ఎప్పుడైనా చూశారా..? అదీ అచ్చం మనిషి దంతాలను పోలి ఉండటాన్ని చూస్తే మీరు అవాక్కవ్వాల్సిందే. అంతేకాక ఈ చేప గొర్రె తలను పోలి ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ చేప తెగ వైరల్ అవుతోంది. ఈ వింత చేపను మీరూ చూసేయండి..

Strange fish
వింత చేప

మానవులకు, కొన్ని రకాల జంతు జాతులకు దంతాలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ, చేపలకు కూడా దంతాలు ఉంటాయనే విషయం తెలిశాక అందరూ ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. మనిషికి ఎలాగైతే దంతాలు ఉంటాయో అచ్చం అలాగే ఓ చేపకు దంతాలు ఉన్న ఫొటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

Strange fish
మనిషి దంతాలు, గొర్రె తలతో వింత చేప

ఎక్కడంటే..?

అమెరికాలోని నార్త్‌ కారోలినాలో చేపలు పట్టే వ్యక్తికి దంతాలు ఉన్న చేప ఒకటి చిక్కింది. ఆ చేపకు మనిషిని పోలిన దంతాలు ఉన్నాయి. ఆ ఫొటోను జెన్నెట్స్ పీర్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. కొద్ది క్షణాల్లోనే దాన్ని 300కు పైగా మంది షేర్‌ చేశారు. చాలా మంది కామెంట్‌ కూడా చేశారు. 'నా దంతాల కంటే ఈ చేపవే బాగున్నాయి'అని, 'చేప దంతాలను శుభ్రం చేయడానికి నాకు బాగా తెలిసిన డెంటిస్ట్‌ ఉన్నాడు'అని కామెంట్‌ చేయడం మొదలుపెట్టారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అనంతరం దీన్ని 'షీప్‌షేడ్‌' అనే చేప జాతికి చెందినదిగా గుర్తించారు. దీని దంతాలు చూడటానికి షీప్‌ (గొర్రె) దంతాలవలె ఉండటం వల్ల ఈ చేపకు ఆ పేరు వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: మనవరాలి కోసం మోడల్​గా మారిన బామ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.