ETV Bharat / international

US: బైడెన్​ జట్టులో కీలక పదవికి ఇండో-అమెరికన్!

author img

By

Published : May 27, 2021, 10:21 AM IST

అమెరికా, విదేశీ వాణిజ్య సేవల డైరెక్టర్ జనరల్​గా భారతీయ-అమెరికన్ అరుణ్​ వెంకటరమణను నియమించే యోచనలో అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు.. గ్లోబల్ మార్కెట్స్ అసిస్టెంట్ సెక్రటరీగానూ వెంకటరమణను ఎంపిక చేయనున్నట్లు శ్వేతసౌధ వర్గాలు వెల్లడించాయి.

Biden nominates Indian American to a key administration post
బైడెన్​ జట్టులో కీలక పదవికి ఎంపికైన ఇండో-అమెరికన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో మరో భారతీయ అమెరికన్ కీలక స్థానానికి నామినేట్​ అయ్యారు. అంతర్జాతీయ వాణిజ్య సమస్యలపై అపార అనుభవమున్న అరుణ్ వెంకటరమణను విదేశీ వాణిజ్య సేవల డైరెక్టర్ జనరల్​గా బైడెన్ ఎంచుకున్నారు. గత 20ఏళ్లుగా ఎన్నో కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు సహా.. అమెరికా ప్రభుత్వానికి వెంకటరమణ సలహాదారుగా ఉన్నారు.

అంతకుముందు.. వీసా విభాగంలో సీనియర్ డైరెక్టర్​గానూ వెంకటరమణ పనిచేశారు. డిజిటల్ ఎకానమీ, వాణిజ్యం, పన్నుల విభాగం సహా.. పలు అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి వ్యూహాత్మక నాయకత్వం వహించారు.

ఇవీ చదవండి: పోటీ నుంచి తప్పుకున్న భారతీయ అమెరికన్

అమెరికాలో జిల్లా కోర్టు జడ్జిగా భారతీయ అమెరికన్ రూప!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.