బాంబు పేలుడుతో సోమాలియా రాజధాని మొగదిషు ఉలిక్కిపడింది. నగరంలోని ఓ రెస్టారెంటులో బాంబులతో నిండిన వాహనంతో దాడికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 20 మంది మృతి చెందారు. మరో 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
శుక్రవారం రాత్రి.. పేలుడు పదార్థాలతో ఓ వాహనం నగరంలోని ప్రముఖ రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లేలా చేసి.. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించిగా.. రెస్టారెంట్‌తో పాటు సమీపంలోని గృహ సముదాయాలు ధ్వంసమయ్యాయి.
ఈ ఘటన వెనుక స్థానిక ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంస్థకు అల్‌ఖైదా ఉగ్ర సంస్థతో సంబంధాలున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: 'సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చైనా దూకుడుకు నిదర్శనం'