ETV Bharat / entertainment

Bichagadu 2 Review : 'బిచ్చగాడు 2' మూవీ ట్విట్టర్ రివ్యూ

author img

By

Published : May 19, 2023, 11:50 AM IST

Bichagadu 2 Review : విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన చిత్రం బిచ్చగాడు 2. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను థియేటర్​లో చూసిన ప్రేక్షకులు.. తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేస్తున్నారు. సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా మరి.

bichagadu 2 review
bichagadu 2 review

Bichagadu 2 Review : విజయ్ అంటోనీ హీరోగా 2016లో వచ్చిన 'బిచ్చగాడు' ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా తమిళంలో కన్నా తెలుగులోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్​ను అందుకుంది. విజయ్ అంటోనీ కెరీర్​లోనే అత్యధిక కలెక్షన్లను సాధించిందీ సినిమా. అయితే ఆ సినిమాకు సీక్వెల్​గా తెరకెక్కిన 'బిచ్చగాడు 2' సినిమా భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీయే దర్శకత్వం వహించారు. ఆయన భార్య ఫాతిమా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. విజయ్​కు జోడీగా కావ్య థాపర్​ నటించారు. 'బిచ్చగాడు 2'ను థియేటర్లతో చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్​ వేదికగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ వారు ఏమంటున్నారంటే?

'బిచ్చగాడు 2' సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. 'బిచ్చగాడు 2' సినిమా 'బిచ్చగాడు'కు సీక్వెల్ కాదని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఫస్టాఫ్​లో కొన్ని సీన్లు ప్రేక్షకులను కట్టిపడేసేశాయట. థ్రిల్లింగ్​కు గురిచేసే అంశాలు ఉన్నాయని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇంటర్వెల్ సీన్​ మంచి ట్విస్ట్​తో ముగుస్తుందని చెబుతున్నారు. అయితే వీఎఫ్ఎక్స్ పేలవంగా ఉన్నాయని చెబుతున్నారు. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా పండలేదని.. స్క్రీన్​ప్లే పేలవంగా ఉందని అంటున్నారు.

  • #Pichaikkaran2 - Not a sequel, Standalone film. Apt Title though. Kids gud. Poor VFX. Low production values. Screenplay is dull. No emotional connect. Anti Bikili idea nice, Bad execution. Hardly 1/2 interesting scenes in entire film. Vijay Antony debut Dir. Total DISAPPOINTMENT!

    — Christopher Kanagaraj (@Chrissuccess) May 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #Bichagadu2 First half report: 1st half has thriller elements that engages audience. Missing lip sync is an annoying point though. First half ends with an interesting twist and now th3 fate of the movie depends on how much the 2nd half engages. For live updates and review follow…

    — TeluguBulletin.com (@TeluguBulletin) May 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బిచ్చగాడు 2లో సత్య, విజయ్​ అనే రెండు పాత్రల్లో హీరో విజయ్ ఆంటోనీ కనిపించినట్లు తెలుస్తోంది. ఒక పాత్రలో మురికివాడలో నివసించే వ్యక్తిగా, మరో పాత్ర బిలియనీర్​గా కనిపించారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇంటర్వెల్​ వరకు ఈ సినిమా యావరేజ్​గా ఉందని అంటున్నారు. విజయ్ ఆంటోనీ లుక్​ పరంగా ఆకట్టుకున్నాడని.. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయని అభిప్రాయపడుతున్నారు. సినిమా రెండో భాగం కాస్త నెమ్మదించిందని చెబుతున్నారు. ఇదే సినిమాకు కాస్త మైనస్ పాయింట్​ అని టాక్​.

  • #Bichagadu2 First half report: 1st half has thriller elements that engages audience. Missing lip sync is an annoying point though. First half ends with an interesting twist and now th3 fate of the movie depends on how much the 2nd half engages. For live updates and review follow…

    — TeluguBulletin.com (@TeluguBulletin) May 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విజయ్​కు ప్రమాదం..
'బిచ్చగాడు 2'లో సినిమా షూటింగ్ మలేసియాలో జరుగుతుండగా విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురయ్యారు. ఓ సీన్ కోసం విజయ్ ఆంటోనీ చాలా వేగంగా వాటర్​ బైక్ డ్రైవ్ చేశారు. అదుపు తప్పి కెమెరా ఉన్న పడవను విజయ్​ ఆంటోనీ ఢీకొట్టారు. దీంతో విజయ్ ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. దవడం భాగం కూడా కిందకి జారింది.​ అప్రమత్తమైన మూవీ టీమ్ వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించింది. విజయ్​ ముఖానికి తగిలిన గాయాలు కనిపించకుండా, దవడను సరిచేయడానికి సుమారు 9 ప్లేట్లు వేశారు. నెలన్నరపాటు ఆయన లిక్విడ్‌ డైట్‌లోనే ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.