ETV Bharat / entertainment

రామ్​చరణ్​పై టైటానిక్​ నటి ప్రశంసల వర్షం​.. బాడీ ఫిట్​నెస్​ అదుర్స్​ అంటూ!

author img

By

Published : Jan 4, 2023, 10:50 AM IST

Updated : Jan 4, 2023, 11:05 AM IST

టాలీవుడ్​ స్టార్ హీరో రామ్​ చరణ్​పై టైటానిక్​ ఫేమ్​ ఫ్రాన్సెస్​ ఫిషర్.. ట్విట్టర్​లో​ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆమె ట్వీట్​ వైరల్​గా మారింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?

Frances Fisher Compliments On Ram Charan
Ram Charan Frances Fisher

'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి సంచలనం సృష్టించారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఆ పాత్రలో చరణ్ ఎంతో ఒదిగిపోయి యాక్ట్​ చేశారు. క్లైమాక్స్ సీక్వెన్స్‌లో, ఆయన నటన బీస్ట్ మోడ్​ను తలపించింది. జేమ్స్​ కామెరూన్‌ తెరకెక్కించిన​ టైటానిక్​లో హీరోయిన్ కేట్ విన్స్లెట్​కు తల్లిగా నటించిన ఫ్రాన్సెస్​ ఫిషర్​ తాజాగా చరణ్​ను పొగడ్తలతో ముంచెత్తారు.

చరణ్​ ట్వీట్​కు ఆమె రిప్లై ఇచ్చారు. స్టంట్స్, డ్యాన్స్​తో పాటు యాక్టింగ్​ చేయడంలో ఆయన బాడీ ఫిట్​నెస్​ చక్కగా ఉందని అభినందించారు. ప్రస్తుతం ఆమె రిప్లై ట్విట్టర్​లో వైరలవుతోంది. ప్రస్తుతం దర్శకుడు శంకర్​ రూపొందిస్తున్న పొలిటికల్​ యాక్షన్​ డ్రామా చిత్రంలో చరణ్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్​తో నిర్మాత దిల్​రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ.. చరణ్​కు జోడీగా కనువిందు చేయనున్నారు. ఈ సినిమా..2023లోనే రిలీజ్​ అయ్యే అవకాశం ఉంది.

Frances Fisher Retweet On Ram Charans Tweet
ఫ్రాన్సెస్​ ఫిషర్​ రిట్వీట్​
Last Updated : Jan 4, 2023, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.