ETV Bharat / entertainment

Sreeleela Movies : ఆరు నెలల్లో ఐదు మూవీలు రిలీజ్​.. సెన్సేషనల్​ బ్యూటీ క్రేజీ రికార్డు!

author img

By

Published : Aug 2, 2023, 10:31 AM IST

Sreeleela Upcoming Movies : తెలుగమ్మాయి కాకపోయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్​లో దూసుకుపోతోంది యంగ్ హీరోయిన్​ శ్రీలీల. అతి తక్కువ కాలంలోనే సూపర్​ ఫ్యాన్​ ఫాలోయింగ్​ను పెంచుకుని టాప్ హీరోయిన్​గా ఎదుగుతోంది. తాజాగా ఆమె ఓ క్రేజీ రికార్డు సృష్టించిందట. అదేంటంటే?

Sreeleela Upcoming Movies
Sreeleela Upcoming Movies

Sreeleela Upcoming Movies : టాలీవుడ్​ ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీయెస్ట్ అండ్ క్యూట్​​ బ్యూటీ అనగానే అందరికీ గుర్తొచ్చేది కన్నడ భామ శ్రీలీలనే. 'పెళ్లి సందడి'తో పరిచయమైన ఈ భామ.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో జెట్ స్పీడ్​తో కెరీర్​లో దూసుకెళ్తోంది. గ్యాప్ లేకుండా షూటింగ్​లలో పాల్గొంటోంది. యువ కథనాయకుల నుంచి అగ్ర హీరోలకు వరకు అందరితోనూ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో 10 వరకు సినిమాలున్నాయి. అలా బిజీబిజీగా ఉన్న ఈ బ్యూటీ.. వేరే ఏ హీరోయిన్‌కు సాధ్యం కానీ విధంగా రికార్డ్ సృష్టించింది.

Sreeleela Movies : శ్రీలీల నటిస్తున్న దాదాపు ఐదు చిత్రాలు.. వచ్చే ఆరు నెలల్లో థియేటర్లలోకి రానున్నాయి. మెగాహీరో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' ఆగస్టు 18న, రామ్ 'స్కంద' సెప్టెంబరు 18న, బాలకృష్ణ 'భగవంత్ కేసరి' అక్టోబరు 19న, నితిన్ 'ఎక్స్ ట్రా' డిసెంబరు 23న, మహేశ్ 'గుంటూరు కారం' జనవరి 13న థియేటర్లలోకి రానున్నాయి.

గతంలో ఓ హీరోయిన్ నటించిన రెండు మూడు చిత్రాలు వరుస నెలల్లో విడుదలయ్యాయి. కానీ ఇలా ఐదు సినిమాలు, అది కూడా ఇంత తక్కువ టైంలో రావడం మాత్రం బహుశా ఇదే తొలిసారి అని టాక్​ వినిపిస్తోంది. దీంతో శ్రీలీల.. తక్కువ సమయంలో క్రేజీ రికార్డు సాధించిందని నెటిజన్లు అంటున్నారు. "శ్రీలీల నక్క తోక తొక్కింది. లేకపోతే ఏంటబ్బా.. తిప్పికొడితే పాతికేళ్లు లేవు. కానీ స్టార్ హీరోయిన్లకు చెమటలు పట్టిస్తోంది. ఎందుకంటే స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోస్ వరకు అందరి ఛాయిస్ ఈమెనే. అస్సలు ఖాళీ ఉండట్లేదు" అంటూ చర్చించుకుటున్నారు.

Sreeleela New Movies : తెలుగు మూలాలున్న శ్రీలీల అమెరికాలో పుట్టింది. మూడేళ్లకే డ్యాన్స్ నేర్చుకున్న ఈ బ్యూటీ.. కన్నడ సినిమాతో నటిగా మారింది. అక్కడ ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. 'పెళ్లి సందD'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా ఆడలేదు కానీ శ్రీలీలకు అందరూ ఫిదా అయిపోయారు. దీని తర్వాత రవితేజ 'ధమాకా'లో క్యూట్ అండ్ స్వీట్ యాక్టింగ్‌తో అదరగొట్టేసింది. డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోస్ వరకు ప్రస్తుతం అందరి ఛాయిస్ ఈమెనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.