ETV Bharat / entertainment

సుక్కు స్కూల్​ నుంచి మరో డైరెక్టర్​.. సిద్ధు నెక్ట్స్​ మూవీ ఫిక్స్​!

author img

By

Published : Feb 7, 2023, 11:26 AM IST

Updated : Feb 7, 2023, 10:27 PM IST

సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. సుకుమార్​ స్కూల్​ నుంచి మరో కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నారు. అతడితోనే సిద్ధు తన న్యూ మూవీని చేయబోతున్నారు. ఆ డైరెక్టర్​ ఎవరంటే..

Sukumar
సుక్కు స్కూల్​ నుంచి మరో డైరెక్టర్​.. సిద్ధు నెక్ట్స్​ మూవీ అతడితోనేనా

'గుంటూరు టాకీస్‌', 'కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా', 'డీజే టిల్లు' లాంటి చిత్రాలతో.. ఆడియెన్స్​లో ఫుల్​ క్రేజ్ సంపాదించుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ. అతడి నటనతో పాటు యాటిట్యూడ్​కు యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఇకపోతే ఈ చిత్ర విజయంతో అతడితో సినిమా చేసేందుకు కుర్ర దర్శకులంతా క్యూ కడుతున్నారని తెలిసింది. కానీ ఇప్పుడు వరకు అతడు కొత్త సినిమాను ప్రకటించలేదు. ఇంకా కథలు వింటూనే డీజే టిల్లు సీక్వెల్​ను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. కెరీర్ మొదటి నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న సిద్ధు ఇప్పుడు కూడా అదే తరహా కథలను ఎంచుకోవాలని చూస్తున్నాడట.

దర్శకుడు సుకుమార్​ దగ్గర పని చేసే అసిస్టెంట్​ డైరెక్టర్స్​ అంతా బయటకు వచ్చి దర్శకులుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సుక్కూ స్కూల్​ నుంచి మరో కొత్త డైరెక్టర్​ రాబోతున్నారు. తాజాగా ఈ యంగ్‌ హీరో తన పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమా ‌ను ప్రకటించారు. ఈ మూవీతో కొత్త దర్శకురాలు వైష్ణవి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ దీనిని నిర్మించనున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిపి తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది. "సిద్ధూతో కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. సినీప్రియులంతా సిద్ధంగా ఉండండి అని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం సిద్ధూ 'డీజెే టిల్లు' సినిమా సీక్వెల్‌గా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రామ్‌ మల్లిక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్​పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు.

Sukumar
సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా

ఇక డీజే టిల్లు 2 విషయానికొస్తే.. టిల్లు స్వ్కేర్‌ రాబోతున్న ఈ చిత్రంలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోందీ మూవీ. 'డిజే టిల్లు'కు విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించగా దాని సీక్వెల్‌ను రామ్‌ మల్లిక్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. సూర్య దేవర నాగవంశీ నిర్మాత. తొలి భాగంలోని హీరో పాత్ర టిల్లు, హీరోయిన్‌ నేహాశెట్టి రాధిక పాత్ర యూత్​ను తెగ ఆకట్టుకున్నాయి. దాంతో, రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదీ చూడండి: మాధవన్ ఆడిషన్ వీడియో వైరల్​.. ఎంత ఎమోషనల్​గా చెప్పారో!

Last Updated :Feb 7, 2023, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.