ETV Bharat / entertainment

ఒకే సినిమా- రెండు సెపరేట్ ట్రైలర్లు- ఇదో కొత్త ట్రెండ్ బాసూ!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 2:58 PM IST

Merry Christmas Movie Trailer : కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్​ సేతుపతి, బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్​ నటిస్తున్న తాజా చిత్రం క్రిస్మస్. ఇటీవలే ఈ సినిమా నుంచి సాలిడ్ అప్​డేట్​ ఇచ్చారు మేకర్స్. అయితే కాస్త వెరైటీగా రెండు భాషల్లో వేర్వేరు ట్రైలర్లను విడుదుల చేశారు. ఆ విశేషాలు మీ కోసం

Merry Christmas Movie Trailer
Merry Christmas Movie Trailer

Merry Christmas Movie Trailer : కోలీవుడ్ స్టార్ హీరో, విలన్, నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం చేతి నిండా సినిమాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆయన బాలీవుడ్​లో మరో సినిమాకు సైన్​ చేశారు. 'బద్లాపూర్‌', 'అంధాదూన్‌' వంటి బ్లాక్​ బస్టర్​ సినిమాలు తెరకెక్కించిన శ్రీరామ్‌ రాఘవన్​తో కలిసి ఆయన'మేరీ క్రిస్మస్' అనే సినిమాకు సైన్​ చేశారు. ఇందులో​ బాలీవుడ్​ బ్యూటీ కత్రినా కైఫ్​ హీరోయిన్​గా నటిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు. దాంతో పాటు రిలీజ్​ డేట్​పై కూడా క్లారిటీ ఇచ్చారు. తమిళం, హిందీలో ఒకే కంటెంట్​తో ఈ సినిమా తెరకెక్కినప్పటికీ ట్రైలర్లు మాత్రం వేర్వేరుగా విడుదల చేశారు మేకర్స్​. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చెందిన రెండు ట్రైలర్లు మూవీపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

డైరెక్టర్​ శ్రీరామ్​ రాఘవన్ సినిమాలో​ ఫుల్ ట్విస్ట్​లు, సర్​ప్రైజ్​లు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు ట్రైలర్‌లు సినీ ఇండస్ట్రీలో టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారాయి. ఎందుకంటే ఒక చిత్రం నుంచి రెండు ట్రైలర్లు రిలీజ్ చేయడం ఇదే తొలిసారి. దీంతో కొత్త ట్రెండ్​ను సినీవర్గాలు చెబుతున్నాయి.

మేరీ క్రిస్మ‌స్ మూవీతోనే విజ‌య్ సేతుప‌తి బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయాల్సింది. ఆయన హిందీలో అంగీక‌రించిన ఫ‌స్ట్ మూవీ ఇదే. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో మేరీ క్రిస్మ‌స్ మూడో సినిమాగా రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది ముంబైక‌ర్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు విజ‌య సేతుప‌తి.

Merry Christmas Cast : మ్యాచ్‌ బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రమేష్ తౌరానీస్ టిప్స్ ఇండస్ట్రీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌తో పాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్నూ ఆనంద్ నటిస్తున్నారు. తమిళ వెర్షన్‌లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో కనిపించనున్నారు. అయితే తెలుగులో ఈ సినిమా డబ్​ కావడం లేదని సమాచారం.

చెర్రీ సినిమాలో విలన్​గా విజయ్ సేతుపతి! భలే ప్లాన్ చేశారుగా.. ఇక థియేటర్లలో ఫ్యాన్స్​కు పూనకాలే

Lokesh Kanagaraj And Vijay Sethupathi : LCUలో మళ్లీ సంతానం పాత్ర ఉంటుందా?.. లోకేశ్ ఆన్సర్ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.