ETV Bharat / entertainment

వివాదాస్పద ఫిల్మ్​ క్రిటిక్​ అరెస్ట్, కారణమిదే​

author img

By

Published : Aug 30, 2022, 12:15 PM IST

Updated : Aug 30, 2022, 2:00 PM IST

Film critic KRK Arrest బాలీవుడ్ నటుడు, క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్‌ను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఓ వివాదస్పద ట్వీట్​ చేసిన కారణంగా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Film critic KRK Arrest
వివాదస్పద ఫిల్మ్​ క్రిటిక్​ అరెస్ట్, కారణమిదే​

బాలీవుడ్‌ నటుడు కమల్‌ రషీద్‌ ఖాన్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. 2020లో చేసిన వివాదాస్పద ట్వీట్‌పై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే కేఆర్‌కేను ముంబయి మిమానాశ్రయంలో మలాడ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి బోరివలి కోర్టులో హాజరుపరిచారు. దీంతో అతడిని విచారించిన న్యాయస్థానం కేఆర్​కేను 14 రోజుల పాటు జ్యుడిషియల్​ కస్టడీకి పంపించింది.

తనకు తాను సినీ విశ్లేషకుడినని చెప్పుకునే కేఆర్​కే.. హిందీలో కొన్ని సినిమాలు చేసినా.. వాటి వల్ల ఆయనకు గుర్తింపు రాలేదు. అయితే సోషల్​మీడియా ద్వారా ప్రముఖ బాలీవుడ్‌ హీరోలు సల్మాన్‌ ఖాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, ఆమిర్‌ ఖాన్‌, షారుఖ్​ ఖాన్‌.. ఇలా చాలా మంది హీరోలపై ఎప్పుడూ విమర్శలు చేస్తూ వెలుగులోకి వచ్చాడు. సినిమాలపై నెగటివ్​ రివ్యూలు, కాంట్రవర్సీ ట్వీట్లు చేస్తూ ​మీడియాలో హాట్​టాపిక్​గా మారాడు. ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన 'ఆర్ఆర్ఆర' సినిమాపై కూడా నెగటివ్​ కామెంట్లు చేసి విమర్శలను ఎదుర్కొన్నాడు. కాగా, గతంలో సల్మాన్, మనోజ్ బాజ్‌పాయ్ సహా పలువురు గతంలో అతడిపై కేసులు వేశారు.

ఇదీ చూడండి: బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​తో శుభమన్​ గిల్​ డేటింగ్, మరి సచిన్​ కుమార్తె పరిస్థితేంటో

Last Updated : Aug 30, 2022, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.