ETV Bharat / entertainment

ఊర్రూతలూగిస్తున్న బాలయ్య 'అన్​స్టాపబుల్'​ యాంథమ్​.. అదిరిపోయింది అంతే!

author img

By

Published : Sep 27, 2022, 4:41 PM IST

Updated : Sep 27, 2022, 5:06 PM IST

నట సింహాం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్​స్టాపబుల్​ టాక్​ షో రెండో సీజన్​ యాంథమ్​ విడుదల అయింది. ఇది అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

unstoppable season 2 anthem
అన్​స్టాపబుల్ సీజన్ 2 యాంథమ్​

నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్‌షో 'అన్‌స్టాబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. ఆహాలో ప్రసారమైన ఈ టాక్‌ షో విశేష ప్రజాదరణ పొందింది. తనదైన మ్యానరిజం, పంచ్​ డైలాగ్స్​తో బాలయ్య ప్రేక్షకులను బాగా అలరించారు. అయితే ఈ షో రెండో సీజన్‌ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా సీజన్ 2కు సంబంధించి ఆహా ఓ సాలిడ్‌ అప్‌డేట్‌ను ఇచ్చింది. అన్​స్టాపబుల్ యాంథమ్​ను విడుదల చేసింది. ఇది అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

ఈ పాటను ర్యాపర్​ రోల్​రైడా ఆలపించగా, యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్​ స్వరాలు సమకూర్చారు. 3.39 నిమిషాలు నిడివి ఉన్న ఈ సాంగ్​.. 'ఏదైనా నేను దిగనంత వరకే, వన్స్​ ఐ స్టెప్​ ఇన్​ హిస్టరీ రిపీట్' అంటూ బాలయ్య డైలాగ్​తో ప్రారంభమైంది. 'తను ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంటా.. డైలాగ్ వదిలితే మోగి పోద్ది బాడీ అంతా' అంటూ ఆయన గత సినిమా పేర్లు, డైలాగ్​లు కలగలపి ఈ పాటను రూపొందించారు. వీడియోలో.. తొలి సీజన్​లో సెలబ్రిటీ కంటెస్టెంట్​లతో బాలయ్య సందడి చేసిన సన్నివేశాలు, మేకింగ్ వీడియోలను చూపించడం ఆకట్టుకుంటోంది. మొత్తంగా ఈ హైపర్​ సాంగ్​ ఫ్యాన్స్​కు పూనకాలు తెప్పించేలా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: విజయ్​-అజిత్​ కాంబోలో మల్టీస్టారర్​.. దర్శకుడు ఎవరంటే?

Last Updated :Sep 27, 2022, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.