ETV Bharat / entertainment

ఎవరికీ ఆ సామర్థ్యం లేదు.. అది అబద్ధం..! : 'ఆదిపురుష్​' ఔం రౌత్​

author img

By

Published : Jun 18, 2023, 5:21 PM IST

Adipurush om raut : ఆదిపురుష్ నెగటివిటీపై దర్శకుడు ఔం రౌత్ మాట్లాడారు. అలానే త్వరలోనే దర్శకుడు నితేశ్‌ తివారీ రూపొందించనున్న రామాయణంపై కూడా స్పందించారు. ఆ సంగతులు..

Adipurush director Om raut
ఎవరికీ ఆ సామర్థ్యం లేదు.. అబద్ధం చెబుతున్నారు! : 'ఆదిపురుష్​' ఔం రౌత్​

Adipurush om raut : రామాయణం ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు నితేశ్‌ తివారీ ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కించబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ హీరో రణ్‌బీర్‌ కపూర్‌-హీరోయిన్ అలియాభట్‌ ప్రధాన పాత్రల్లో ఇది రూపొందనుందని అంటున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యశ్​ రావణాసురుడిగా కనిపించనున్నారని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో సినిమా సెట్స్​పైకి వెళ్లనుందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్​పై 'ఆదిపురుష్‌' దర్శకుడు ఓం రౌత్‌ స్పందించారు. ప్రతి రామ భక్తుడిలాగే ఆ ప్రాజెక్ట్‌ కోసం తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

Ramayan movie nitesh tiwari : "నితేశ్‌ గొప్ప డైరెక్టర్​. అలాగే నాకు మంచి స్నేహితుడు కూడా. ఆయన తెరకెక్కించిన 'దంగల్‌' సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కథను రచించిన విధానం, సినిమాను తీర్చిదిద్దిన తీరు మరో స్థాయిలో ఉంటుంది. ప్రతి రామ భక్తుడిలాగా నేనూ నితేశ్‌ తెరకెక్కించబోయే సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. రామాయణం, శ్రీరాముడి గురించి ఇప్పటికే ఎన్నో చిత్రాలు వెండితెరపై రూపొందాయి. రామాయణం మన ఇతిహాసం. ఈ ఇతిహాస గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసం ఓ చిత్రాన్ని ఎన్ని సార్లైనా రూపొందించొచ్చు. వీలైనంత వరకు ఎక్కువ మందికి ఈ కథ తెలిసేలా చేయాలి" అని ఓంరౌత్‌ అన్నారు.

Adipurush trolls : సామర్థ్యం ఎవరికీ లేదు : 'ఆదిపురుష్'​పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఆడియెన్స్​. కొంతమంది సోషల్​మీడియాలో ట్రోలింగ్‌ కూడా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఓం రౌత్‌కు రామాయణం తెలుసా? అని కూడా అంటున్నారు. అయితే ఈ నెగెటివ్‌ రివ్యూలపై కూడా ఓం రౌత్‌ మాట్లాడారు. "బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇక్కడ ముఖ్యం. ఈ విషయంలో నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. అయితే నాకు రామాయణం అంతా తెలుసని చెబితే అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే రామాయణాన్ని పూర్తిగా అర్థం చేసుకునే సామర్థ్యం ఎవరికీ లేదు అని నా అభిప్రాయం. నాకు, మీకు తెలిసిన రామాయణం.. ఉడుత చేసే సాయం అంత ఉంటుంది. నాకు అర్థమైన కొంత భాగాన్ని తెరపై చూపించేందుకు ప్రయత్నం చేశాను. రామాయణాన్ని పూర్తిగా తెరపై చూపించడం అంత ఈజీ కాదు. అందుకే అందులోని కొంత భాగంపై దృష్టి పెట్టాను. అయినా రామాయణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. నాకు రామాయణం మొత్తం తెలుసు అని ఎవరైనా అన్నారంటే.. దాన్ని తెలివి తక్కువ తనం అని చెప్పాలి. లేదంటే అబద్ధమైనా అని చెప్పాలి" అని వివరించారు ఓం రౌత్‌.

ఇదీ చూడండి :

Adipurush Dialogues : దిగొచ్చిన 'ఆదిపురుష్'​ టీమ్​.. ఆ డైలాగుల్లో మార్పులు

Adipurush Collections : రూ.200 కోట్ల క్లబ్​లోకి 'ఆదిపురుష్​'.. రామాయణం తీయలేదన్న రైటర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.