ETV Bharat / crime

Shilpa Chowdary Cheating Case : శిల్పాచౌదరి చేతిలో మోసపోయిన హీరో

author img

By

Published : Dec 3, 2021, 1:14 PM IST

Updated : Dec 3, 2021, 7:42 PM IST

Shilpa Chowdary Cheating Case
శిల్పపై నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో మరో ఫిర్యాదు

13:11 December 03

శిల్పపై నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో మరో ఫిర్యాదు

Shilpa Chowdary Cheating Case :పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన మహిళ.. శిల్పా చౌదరిపై నార్సింగి పోలీస్​స్టేషన్​లో మరో ఫిర్యాదు నమోదైంది. కథానాయకుడు హర్ష.. శిల్పపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెహరి సినిమాలో హీరోగా హర్ష నటించారు. రూ.3 కోట్లు తీసుకొని తిరిగి చెల్లించలేదని హర్ష పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెహరి చిత్రాన్ని శిల్ప నిర్మించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నార్సింగి పోలీసులు రెండు రోజుల కస్టడీ తీసుకున్నారు.

Shilpa Chowdary: కోర్టు అనుమతితో శిల్పను విచారించనున్నారు. శిల్ప ఎవరెవరి వద్ద నుంచి ఎంత సొమ్ము తీసుకుందనే వివరాలు రాబట్టనున్నారు. డబ్బులు ఎక్కడకు మళ్లించారు. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపైనా పోలీసులు లోతుగా ఆరా తీయనున్నారు. శిల్పా చౌదరిపై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేయగా.. 7 కోట్ల 5లక్షలు తీసుకుందని పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లలోనూ కేసులు నమోదయ్యాయి. కిట్టీ పార్టీల పేరుతో మహిళలను ఆకట్టుకున్న శిల్పాచౌదరి.. స్థిరాస్తి వ్యాపారం కోసమంటూ డబ్బు తీసుకుందని పోలీసులు గుర్తించారు. భారీగా లాభాలిస్తానని నమ్మించి మోసం చేసిందని ఫిర్యాదులు అందాయి. 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్‌పల్లి కోర్టును పోలీసులు కోరగా.. రెండు రోజులు విచారణ చేసేందుకు అనుమతిచ్చింది.

ఇవీ చూడండి

Shilpa Chaudhary case: అధిక వడ్డీ ఇస్తానంటూ కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడిన శిల్పాచౌదరి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తన వద్ద 2.4 కోట్లు తీసుకుని మోసం చేసిందని నార్సింగి ఠాణాలో మరో మహిళ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది అధిక వడ్డీ ఇస్తానని డబ్బు తీసుకుందని... ఇవ్వకుండా మోసం చేసిందని బాధితురాలి ఫిర్యాదులో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Shilpa fraud: మోసం చేయడమే ఆమె లక్ష్యం. భార్య చేసే మోసాలకు వత్తాసు పలకడమే భర్త లక్షణం. అధిక వడ్డీలు, వ్యాపారాల్లో లాభాల పేరిట వల వేసి.. వారి నుంచి కోట్లలో డబ్బులు తీసుకుని.. విలాసవంతమైన జీవితాన్ని గడపడమే ఆ దంపతుల ధ్యేయం. అలా మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరి (Shilpa fraud) గుట్టు ఎట్టకేలకు బయటపడింది. శిల్పను, ఆమె భర్త శ్రీనివాస్​ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. కోటి 5లక్షల రూపాయల తీసుకొని తిరిగి ఇవ్వలేదని దివ్య అనే మహిళ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Last Updated : Dec 3, 2021, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.