రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాణ్యతలేని హెల్మెట్లు విక్రయిస్తున్న దుకాణాలపై ట్రాఫిక్ పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. హెల్మెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పట్టణంలో విచ్చలవిడిగా నకిలీ హెల్మెట్లు అమ్ముతున్న దుకాణదారులపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. అయినప్పటీకీ వారిలో మార్పు రాకపోవడంతో షాపులపై దాడులు నిర్వహించారు. మళ్లీ ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని మృతి