సమాజంలో పెరుగుతున్న అరాచకాల నుంచి తమ కూతుర్ని ఎలా కాపాడుకోవాలని తపన పడుతున్నారు. ఎటు నుంచి ఏ ముప్పు తమ గారాలపట్టీలను చేరుకుంటుందోనని గుండెల్లో పెట్టుకుని రక్షించుకుంటున్నారు. ఏ మృగమొచ్చి కాటేస్తుందోనని కంటికి రెప్పలా కాచుకుంటున్నారు. ఏ అరాచకం జరగకుండా నాన్నలంతా అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. కానీ.. తండ్రి అనే పదానికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తించాడో ప్రబుద్ధుడు. కన్నకూతురినే కాటేసి.. తండ్రీకూతుళ్ల బంధమే చీదరించుకునే పని చేశాడు. వావివరసలు మరిచి ప్రవర్తించాడనేందుకు అతడు ఏ బంధువు కాదు.. స్వయానా జన్మనిచ్చిన తండ్రి. తన రక్తాన్నే తోడేలై పీల్చాడు. తన ప్రతిరూపాన్నే కసాయివాడే ఛిద్రం చేశాడు. తన నీడలో నడిపించాల్సిన నాన్నే నరరూపరాక్షసుడై.. నరకం చూపించాడు.
రెండో భార్యకు అనుమానం వచ్చి..
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రమేష్.. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. రోజువారీ కూలీ పనులు చేస్తూ.. జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడి మొదటి భార్య రమేష్‌కు విడాకులు ఇచ్చి.. వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె కూతురు మాత్రం తండ్రి రమేష్ వద్దనే ఉంటుంది. మొదటి భార్యతో విడాకులు అనంతరం రమేష్.. మరో మహిళను వివాహం చేసుకున్నాడు. కాగా.. తన మొదటి భార్య కూతురితో రమేష్ అసహజంగా ఉండటాన్ని గమనించిన రెండో భార్య.. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. నివ్వెరపోయే నిజం తెలిసింది.
ఎవరికైనా చెప్తే చంపేస్తానని..
మొదటి భార్య కూతురిపై రమేష్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడన్న విషయం వెలుగుచూసింది. గత కొన్ని రోజులుగా కన్నకూతురిపైనే అత్యాచారం చేస్తున్న కసాయి తండ్రి నిజస్వరూపాన్ని గ్రహించిన అతడి రెండో భార్య.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రమేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
దర్యాప్తులో తేలిందేంటంటే..
"మహబూబ్‌నగర్‌కు చెందిన రమేష్.. 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చాడు. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత రాత్రి(మార్చి 16) అతడి రెండో భార్య ఫిర్యాదు చేసింది. రమేష్ మొదటి భార్య కుమార్తెపై అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు చేయటంతో.. వెంటనే రేప్ కేస్ నమోదు చేశాం. బాధితురాలిని భరోసా సెంటర్‌కు పంపించి.. అటు నుంచి ఆస్పత్రికి కూడా తరలించాం. నిందితుడు రమేష్.. గత కొంత కాలంగా తన కూతురి(మైనర్)పై అత్యాచారం చేస్తున్నాడని దర్యాప్తులో తేలింది. అతడి అరెస్ట్ చేశాం. కోర్టులో ప్రవేశపెడతాం." - నరేష్‌రెడ్డి, బేగంపేట ఏసీపీ
ఇదీ చూడండి: