ETV Bharat / crime

College Girl suicide అమ్మకు భారం కాలేక కుమార్తె ఆత్మహత్య

author img

By

Published : Aug 21, 2022, 7:12 PM IST

College Girl suicide భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో పిల్లలతో సహా తల్లి పుట్టింట్లో ఉంటోంది. తండ్రి తరచూ పాఠశాల వద్దకు వచ్చి పిల్లలను పలకరిస్తూ ఉండేవాడు. కానీ ఈ మధ్య తండ్రి నూతన గృహ ప్రవేశం చేసిన విషయం కుమార్తెతో చెప్పలేదు. దీంతో మనస్తాపానికి గురైన అమ్మాయి తల్లికి చెప్పి బాధపడింది. మరోవైపు తమ కోసం తల్లి కష్టపడటం, భవిష్యత్​పై ఆందోళనతో కుమార్తె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. జుట్టుకు వేసుకునే రంగు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

College Girl suicide
College Girl suicide

College Girl suicide: తల్లిదండ్రులు విడిపోవడాన్ని జీర్ణించుకోలేక, తల్లికి భారం కాలేక ఓ కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు పంగల్‌ రోడ్డులోని ఆదర్శ పాఠశాలలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు మరూరు గ్రామానికి చెందిన సరస్వతి పెళ్లి బుక్కపట్నంకి చెందిన రమేష్‌ బాబుతో జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ఐదేళ్ల కిందట మనస్పర్ధలు రావడంతో.. సరస్వతి కుమార్తె, కుమారుడిని తీసుకొని పుట్టింటికి వచ్చారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కుమార్తె మణిదీప (18)ను రాప్తాడులో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొద్ది రోజులు క్రితం తన తండ్రి బుక్కపట్నంలో నూతన గృహప్రవేశం చేశారు. కార్యక్రమ ఫొటోలను కుటుంబ సభ్యుల చరవాణిలో చూసిన మణిదీప.. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో బాధపడింది.

తల్లిదండ్రులు విడిపోయినా తండ్రి తరచూ పాఠశాల వద్దకు వచ్చి పలకరించేవారు. అయినా ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఇటీవల తల్లితో చెప్పుకుని బాధపడింది. తల్లిదండ్రులు విడిపోవడం, తమ కోసం తల్లి కష్టపడటాన్ని చూసి బాధపడేది. శుక్రవారం రాత్రి 11:30 సమయంలో పాఠశాలలో జుట్టుకు వేసుకునే రంగు తాగింది. ఈ విషయాన్ని తోటి స్నేహితులు పాఠశాల వార్డెన్‌కి వనజకు సమాచారం ఇవ్వడంతో తల్లికి విషయం చెప్పి అర్ధరాత్రి ఒంటి గంటకు అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. శనివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాఘవ రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి: కొత్తగా 4 జిల్లాల్లో కలెక్టరేట్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

సాయం పేరిట మోసం, వ్యభిచార కూపంలోకి దింపి సామూహిక అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.