ETV Bharat / city

Heavy Rains in Telangana: ఈ ఏడాదీ అధిక వర్షాలే.. గత 16 ఏళ్లలో రెండో అత్యధికం

author img

By

Published : Oct 1, 2021, 7:19 AM IST

ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కన్నా 39 శాతం ఎక్కువగా వానలు (rains) కురిశాయి. గత నాలుగు నెలల్లో రాష్ట్ర సాధారణ వర్షపాతం (Rainfall) 752 మి.మీల.కు గాను 1044 మి.మీ.లు కురిసింది. రాష్ట్రంలో ఈ స్థాయిలో వర్షాలు (heavy rains) పడటం అరుదని వాతావరణశాఖ (Department of Meteorology)వర్గాలు తెలిపాయి.

Heavy Rains in Telangana
Heavy Rains in Telangana: ఈ ఏడాదీ అధిక వర్షాలే.. గత 16 ఏళ్లలో రెండో అత్యధికం

రాష్ట్రంలో వరసగా రెండో ఏడాది అత్యధిక వర్షపాతం (Highest rainfall in telangana) నమోదైంది. 2006 నుంచి 2021 వరకు 16 ఏళ్లలో సాధారణం కన్నా 20 శాతానికి మించి వర్షపాతం నమోదవడం ఇది మూడోసారి మాత్రమే. 2010లో 32 శాతం అధికంగా కురిసింది. గతేడాది(2020) వానాకాలంలో 46 శాతం, ఈ ఏడాది 39 శాతం అదనంగా కురిసినట్లు వాతావరణశాఖ (Department of Meteorology) తెలిపింది. వానాకాలం సీజన్‌ (గత జూన్‌ ఒకటి నుంచి సెప్టెంబరు 30 వరకూ) మొత్తం 122 రోజుల్లో 105 రోజులు భారీ వర్షాలు (heavy rains in telangana) కురిశాయి. గత నాలుగు నెలల్లో రాష్ట్ర సాధారణ వర్షపాతం 752 మి.మీల.కు గాను 1044 మి.మీ.లు కురిసింది. రాష్ట్రంలో ఈ స్థాయిలో వర్షాలు పడటం అరుదని వాతావరణశాఖ(Department of Meteorology) వర్గాలు తెలిపాయి.

3 జిల్లాల్లో మైనస్‌ వర్షపాతం

  • రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో సాధారణం కన్నా 1 నుంచి 132 శాతం అధిక వర్షాలు కురవగా.. 3 జిల్లాల్లో మైనస్‌(లోటు) వర్షపాతం నమోదైంది. వనపర్తిలో 17 శాతం, జోగులాంబ గద్వాలలో 13, నాగర్‌కర్నూల్‌లో 5 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
  • ఆగస్టు మినహా మిగతా నెలల్లో నైరుతి రుతుపవన మేఘాలు చాలా వేగంగా రాష్ట్రంపై సంచరించాయి. జులై మొత్తం, సెప్టెంబరులో 28 రోజులపాటు భారీ వర్షాలు కురిశాయి. సాధారణంగా 24 గంటల వ్యవధిలో 12 నుంచి 21 సెంటీమీటర్లకు పైగా వర్షం పడటాన్ని అరుదుగా వాతావరణశాఖ పరిగణిస్తుంది. గత 4 నెలల్లో ఏకంగా 33 రోజుల్లో 12 నుంచి 27 సెం.మీ.ల వర్షం కురవడం రికార్డుగా నమోదైంది.

‘ఈశాన్యం’తో 11 శాతం ఎక్కువ లేదా తక్కువ

అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ఈశాన్య రుతుపవనాలతో దక్షిణ భారతదేశంలో వర్షాలు కురుస్తాయి. వీటి వల్ల ఈసారి 11 శాతం ఎక్కువ లేదా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ తాజా అంచనాలను వెల్లడించింది.

నేడూ, రేపూ ఓ మోస్తరు వర్షాలు

తెలంగాణలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.