-
Ministers @KTRTRS, @YadavTalasani, @SabithaindraTRS and @mahmoodalitrs laid foundation stone for Strategic Nala Development Programme (SNDP) works at Bandlaguda in Nagole. pic.twitter.com/L8T33aqwwu
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ministers @KTRTRS, @YadavTalasani, @SabithaindraTRS and @mahmoodalitrs laid foundation stone for Strategic Nala Development Programme (SNDP) works at Bandlaguda in Nagole. pic.twitter.com/L8T33aqwwu
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 16, 2022Ministers @KTRTRS, @YadavTalasani, @SabithaindraTRS and @mahmoodalitrs laid foundation stone for Strategic Nala Development Programme (SNDP) works at Bandlaguda in Nagole. pic.twitter.com/L8T33aqwwu
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 16, 2022
ఎల్బీనగర్ అండర్‌పాస్ ప్రారంభం..
KTR Demands Funds From Central : ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. ఎల్బీనగర్ కూడలిలో అండర్‌పాస్‌ను ప్రారంభించారు. రూ.9.28 కోట్లతో దీన్ని నిర్మించినట్లు తెలిపారు. అనంతరం నాగోల్, బండ్లగూడలో నాలాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వరద ముంపు నివారణకు రూ.103 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. తర్వాత బైరామల్‌గూడలో రూ.28.64 కోట్లతో జీహెచ్‌ఎంసీ నిర్మించిన పైవంతెన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.
మాతో పోటీ పడాలి..
KTR About Hyderabad Development : భాజపా కార్పొరేటర్లు కూడా వారి వారి వార్డుల అభివృద్ధికి ముందడుగు వేయాలని కేటీఆర్ సూచించారు. పనులు చేసేందుకు ముందుకు రావాలని..స్థానిక ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరపాలని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10వేల కోట్లు మంజూరయ్యేలా చూసి.. హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రగతిలో కాషాయ నేతలు గులాబీ నాయకులతో పోటీ పడాలని అన్నారు.
నిధులు తీసుకురండి..
KTR Visits LB Nagar : "హైదరాబాద్‌లో అతి ముఖ్యమైన సమస్య వరద ముప్పు. ఈ ఏడాది వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నాళాల పనులు వానాకాలంలోగా పూర్తి చేస్తాం. భాగ్యనగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్రం నుంచి భాజపా నిధులు తీసుకురావాలి."
- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి