ETV Bharat / city

మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు సన్నద్ధమేనా : హైకోర్టు

మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సన్నద్ధతపై హైకోర్టు ఆరా తీసింది. ఏ విధంగా ఎదుర్కొంటారో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కరోనా కట్టడిలో పోలీసుల పనితీరును అభినందించింది. తదుపరి విచారణను జూన్​1కి వాయిదా వేసింది.

తెలంగాణ హైకోర్టు, థర్డ్ వేవ్ కరోనా, తెలంగాణలో థర్డ్ వేవ్ కరోనా

author img

By

Published : May 17, 2021, 1:52 PM IST

మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఏవిధంగా ఎదుర్కొంటారో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. బ్లాక్​ఫంగస్ చికిత్స ఏర్పాట్లు, ఔషధాలపై వివరాలు అందజేయాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పరిస్థితిపై ఆరా తీసింది.

పిల్లలను ఎలా ఆదుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిల్లల అక్రమరవాణా, అక్రమ దత్తత ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కమ్యూనిటీ కిచెన్​లు ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. వాహనాలతో కాలనీలు, బస్తీలకు సరకులు చేర్చేలా చర్యలు చేపట్టాలని చెప్పింది.

ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది కరోనాతో మృతి చెందడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులు కరోనా బారినపడి మరణించిన అంశంపై దిగ్భ్రాంతి చెందింది. విచారణకు వైద్యారోగ్య శాఖ అధికారులు హాజరుకావాలని కోరిన ఉన్నత న్యాయస్థానం.. విచారణను జూన్1కి వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.