ETV Bharat / city

'ప్రధాని మోదీ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..'

author img

By

Published : Jun 30, 2022, 7:25 PM IST

Updated : Jun 30, 2022, 7:35 PM IST

Revanth Reddy Comments: ప్రధాని మోదీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వకుండా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. రెండు తెలుగు రాష్ట్రాలను మోదీ మోసం చేశారని దుయ్యబట్టారు.

PCC president Reavanth Reddy comments on PM Modi
PCC president Reavanth Reddy comments on PM Modi

Revanth Reddy Comments: ప్రధాని నరేంద్రమోదీ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రజలను అవమానించిన మోదీ ఏ ముఖం పెటుకొని తెలంగాణకు వస్తున్నారని నిలదీశారు. పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి కానీ.. తెలంగాణలో భాజపా ఎందుకు సమావేశాలు పెడుతున్నారో అర్ధం కావట్లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వకుండా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. రెండు తెలుగు రాష్ట్రాలను మోదీ మోసం చేశారని దుయ్యబట్టారు.

పార్లమెంట్​ తలుపులు మూసి మరీ కాంగ్రెస్​ తెలంగాణ ఇస్తే.. తల్లిని చంపి పిల్లను ఇచ్చారని పార్లమెంట్‌లో మోదీ మాట్లాడారని గుర్తు చేశారు. తెలంగాణను గుర్తించడానికి కూడా మోదీ ముందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి పదవుల్లో దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యమివ్వలేదన్నారు. తెలంగాణలో ఉన్న కేంద్రమంత్రి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని.. ఏపీకి అసలు మంత్రే లేడని ఎద్దేవా చేశారు. వెంకయ్యను ఉపరాష్ట్రపతి పదవి నుంచి దించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగువారిని మోదీ అవమానిస్తున్నారని రేవంత్​రెడ్డి ఆక్షేపించారు.

"ఎనిమిదేళ్లలో తెలంగాణకు కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ మోసం చేశారు. తెలుగువారిని మోదీ అవమానిస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చిల్లర పంచాయతీలు పెట్టుకుంటున్నారు.. ఫ్లెక్సీల కోసం కొట్టుకోవడమా..? విభజన చట్టంలోని అంశాలపై చర్చ పెట్టాలి. సీఎం కేసీఆర్ చిల్లర విషయాలు మానుకోవాలి. అగ్నిపథ్​పై మీ స్టాండ్ ఏంది..? అసెంబ్లీలో అగ్నిపథ్​పై వ్యతిరేకంగా తీర్మానం చేయాలి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కలవడానికి కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్​ని కలిసిన వాళ్లని తాము కలవమని ఉద్ఘాటించారు. కొండా విశ్వేశ్వర రెడ్డి తనకు మిత్రుడన్న రేవంత్​.. భాజపాలో చేరిన కొద్దికాలానికి ఆయనే వెనుదిరిగి చూస్తారని వ్యాఖ్యానించారు." - రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

'ప్రదాని మోదీ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..'

ఇవీ చూడండి:

Last Updated : Jun 30, 2022, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.