ETV Bharat / city

మంత్రి విడదల రజిని కాన్వాాయ్​కు ప్రమాదం.. స్వల్పంగా దెబ్బతిన్న వాహనం

author img

By

Published : Oct 9, 2022, 5:32 PM IST

విడదల రజిని
విడదల రజిని

Accident To Minister Vidadala Rajini Convoy: ఏపీ మంత్రి విడదల రజిని కాన్వాయ్​ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మంత్రి వాహనం స్వల్పంగా దెబ్బతింది.

Accident To Minister Vidadala Rajini Convoy: ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మర్కాపురం సమీపంలో మంత్రి విడదల రజిని కాన్వాయ్​లోని ఓ వాహనం ప్రమాదానికి గురైంది. మార్కాపురంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మంత్రులు విడదల రజిని, ఆదిమూలపు సురేశ్​, మాజీ మంత్రి బాలినేని హాజరయ్యారు. ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత కొనకనమిట్ల మండలానికి మంత్రి విడదల రజిని కాన్వాయ్​ బయలుదేరింది.

ఈ క్రమంలో కాన్వాయ్​లో ముందు వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని మంత్రి విడదల రజిని ఉన్న వాహనం ఢీకొట్టింది. మంత్రి ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది.

ఇవీ చదవండి: నీట మునిగిన అపార్ట్​మెంట్​ సెల్లార్లు.. చెరువులు తలపించిన రహదారులు..

108 ఏళ్ల వృద్ధురాలిపై దారుణం.. బాత్​రూమ్​కు తీసుకెళ్లి.. కాళ్లు నరికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.