ETV Bharat / city

Train Charges Hike For Sankranti: సంక్రాంతికి ఊరెళ్దామనుకుంటే.. టికెట్​ ధరలు సరదా తీర్చేస్తున్నాయి!

author img

By

Published : Jan 7, 2022, 7:25 AM IST

Train Charges Hike For Sankranti : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురం మొదలైంది. ఉద్యోగాలు, చదువుల నిమిత్తం నగరాల్లో ఉంటున్నవారు.. సొంతూళ్లకు పయనమవుతున్నారు. దాదాపు చాలా మంది ఈనెల 11,12,13న ఊళ్లకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. కానీ చాలా మంది బస్సు, రైలు టికెట్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ దొరికినా వాటి ధరలు చూసి షాకవుతున్నారు. పండుగకు సరదాగా కుటుంబంతో గడుపుదామనుకుంటే.. ఈ టికెట్ల ధరలు సరదా తీర్చేస్తున్నాయని వాపోతున్నారు.

Train Charges Hike For Sankranti
Train Charges Hike For Sankranti

Train Charges Hike For Sankranti : సంక్రాంతికి కుటుంబంతో విజయవాడ వెళ్లేందుకు సిద్ధమైన ప్రైవేటు ఉద్యోగి రైలు టికెట్ల కోసం ప్రయత్నించారు. రెగ్యులర్‌ బండ్లలో రిజర్వేషన్‌ పూర్తవడంతో 11వతేదీ నాటికి సువిధ ప్రత్యేక రైలు (నెం.82714)లో టికెట్‌ బుక్‌ చేద్దామనుకున్నారు. సాధారణ రైల్లో రూ.225గా ఉన్న స్లీపర్‌ టికెట్‌ ధర, ఇందులో రూ.1,135 చూపిస్తుండటంతో(సుమారు 5 రెట్లు అదనం) అవాక్కయ్యారు. అంత చెల్లించినా ఇచ్చేది వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లే కావడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Train Charges Hike For Sankranti in Telangana : సికింద్రాబాద్‌-తిరుపతికి రెగ్యులర్‌ రైళ్లలో స్లీపర్‌ టికెట్‌ రూ.425 ఉండగా, 11న వెళ్లే సువిధ (నెం.82720) రైల్లో రూ.1000గా ఉంది. రూ.1,580గా ఉన్న థర్డ్‌ఏసీ టికెట్‌ ధరను రూ.2,935కు పెంచారు.

పండగ రద్దీని సొమ్ము చేసుకుంటూ

Train Charges Hike For Sankranti in AP : సంక్రాంతి పండక్కి తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. ఎక్కువ మంది 11, 12, 13 తేదీల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రైవేటు ట్రావెల్‌ బస్సుల్లో టికెట్‌ ధరలు భారీగా పెరగడం, రెగ్యులర్‌ రైళ్లలో చాలారోజుల క్రితమే రిజర్వేషన్లు పూర్తవడంతో ప్రత్యేక రైళ్ల కోసం సోధిస్తున్నారు. ఇదే అదునుగా ద.మ.రైల్వే అదనపు రైళ్ల పేరుతో.. ‘సువిధ’ ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తూ అడ్డంగా దోచుకుంటోంది. ఉదాహరణకు కాచిగూడ నుంచి నర్సాపూర్‌కు రెగ్యులర్‌ రైల్లో ఫస్ట్‌ ఏసీ టికెట్‌ రూ.1,930 అయితే, సువిధ రైల్లో సెకండ్‌ ఏసీ ధరే రూ.2,890గా ఉండటం దోపిడీకి నిదర్శనమని ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సికింద్రాబాద్‌-విజయవాడల మధ్యే కాదు, హైదరాబాద్‌ నుంచి వరంగల్‌, ఖమ్మం, కాకినాడ, నర్సాపూర్‌, తిరుపతి వంటి మార్గాల్లో ప్రయాణించే ‘సువిధ’ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంది. పండక్కి వెళ్లేటప్పుడే కాదు తిరుగు ప్రయాణంలోనూ టికెట్‌ ధరలు ఇదే తరహాలో ఉన్నాయి. 16న తిరుపతి-కాచిగూడ (నెం.82721), 17న నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ (82722) సహా మరికొన్ని సువిధ రైళ్లలోనూ టికెట్‌ ధరలు నాలుగైదు రెట్లు అధికంగా ఉండటంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.

ఒక్కో రైల్లో ఐదారొందల మంది అదనంగా

Train Charges Hike For Sankranti in Telugu States : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొవిడ్‌ మార్గదర్శకాలు పాటించాలంటూ కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన ద.మ.రైల్వే ప్రయాణికుల ఆరోగ్యం కంటే, జేబుల్ని పిండుకోవడానికే ప్రాధాన్యమిస్తోంది. భౌతిక దూరం సంగతి దేవుడెరుగు, బెర్తులు, సీట్లకు మించి ఒక్కో రైల్లో ఐదారొందల మందికి అదనంగా టికెట్లు ఇస్తోంది. ఉదాహరణకు గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో 12వ తేదీన అదనంగా 543 మంది వెయిటింగ్‌లిస్ట్‌(స్లీపర్‌లో 397, థర్డ్‌ ఏసీ 91, సెకండ్‌ ఏసీ 45, ఫస్ట్‌ ఏసీ 10) టికెట్లు ఇచ్చింది. 17న నర్సాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా 329 మందికి, 11వ తేదీ సికింద్రాబాద్‌-కాకినాడ సువిధ (82714) రైల్లో 18 మందికి వెయిటింగ్‌లిస్ట్‌ టికెట్లు కేటాయించింది. ఇతర అన్ని రైళ్లలోనూ ఇంచుమించు ఇదే తరహాలో పరిస్థితి ఉంది.

ఉప రాష్ట్రపతి సూచనలు బుట్టదాఖలు

Train Charges for Sankranti Special Buses : పండగ సమయాలు, బాగా రద్దీ ఉన్న మార్గాల్లో రైల్వేశాఖ సువిధ రైళ్లను నడుపుతోంది. ఆ సమయాల్లో టికెట్‌ ధరలను ఇష్టానుసారం పెంచేస్తోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మూడేళ్ల క్రితం స్పందించి అప్పటి రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌తో మాట్లాడారు. పండగ సమయాల్లో సామాన్య ప్రయాణికులపై అధిక ఛార్జీల భారం వేయొద్దని సూచించడంతో రైల్వేశాఖ ఆ విధానాన్ని పక్కన పెట్టింది. మళ్లీ ఇప్పుడు సువిధ పేరుతో ఛార్జీల దోపిడీకి తెర లేపింది. రెండు, మూడు రోజుల్లో మరిన్ని సువిధ రైళ్లను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.

.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.