ETV Bharat / city

జీవశాస్త్రాల ఆవిష్కరణలకు ప్రోత్సాహమిచ్చేలా.. బయో ఆసియా సదస్సు..

author img

By

Published : Feb 26, 2022, 5:26 AM IST

Bio Asia Summit 2022: హైదరాబాద్ వేదికగా జరిగిన బయో ఆసియా సదస్సు.... జీవశాస్త్ర ఆవిష్కరణలకు ప్రోత్సాహమిచ్చేలా జరిగింది. రెండు రోజుల పాటు వర్చువల్‌గా జరిగిన సదస్సు ఘనంగా ముగిసింది. 70 దేశాల నుంచి 37 వేల 500 మంది హాజరై... విలువైన సూచనలు చేశారు. కొవిడ్ నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా... మరిన్ని మహమ్మరులను ఎదుర్కొనేలా... రోడ్ మ్యాప్‌తో సిద్ధం కావాలని బయో ఆసియా సదస్సు పిలుపునిచ్చింది.

Bio Asia Summit 2022 closed in a grand way in Hyderabad after two days of conferences
Bio Asia Summit 2022 closed in a grand way in Hyderabad after two days of conferences

జీవశాస్త్రాల ఆవిష్కరణలకు ప్రోత్సాహమిచ్చేలా.. బయో ఆసియా సదస్సు..

Bio Asia Summit 2022: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 19వ ఎడిషన్‌ బయో ఆసియా సదస్సు ఫలప్రదంగా ముగిసింది. సదస్సు ముగింపు సందర్భంగా ప్రభుత్వం తరఫున ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ పాల్గొన్నారు. జీవశాస్త్ర రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. పరిశ్రమల స్థాపన, ఆవిష్కరణలు, పరిశోధనలను విశేషంగా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఔషధ నగరి వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రం మరింత పురగమిస్తోందని వివరించారు.

70 దేశాలకు చెందిన 37 వేల 500 మంది..

అంతర్జాతీయ సంస్థల నిపుణులు, ప్రఖ్యాత సంస్థల అధిపతులు, నిపుణులు బయో ఆసియా సదస్సులో పాల్గొని.... తమ ఆలోచనలను పంచుకున్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా.. తక్కువ ఖర్చుతో.... ప్రభావంతమైన పరిష్కారాలను చూపవచ్చనే సందేశాన్ని బయో సదస్సు ఇచ్చింది. రెండు రోజులు జరిగిన ఈ సదస్సులో 70 దేశాలకు చెందిన 37 వేల 500 మంది పాల్గొన్నారు. 15 చర్చాగోష్ఠులు సాగాయి. కేటీఆర్‌-బిల్‌గేట్స్‌ మధ్య జరిగిన చర్చ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తూ..

ఫార్మా, బయోఫార్మా రంగాల్లో భవిష్యత్తు భారత్‌దేనని నిపుణులు స్పష్టం చేశారు. ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తూ సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. ఫార్మా, బయోఫార్మా రంగాల్లో ఆవిష్కరణలు-సవాళ్లు అనే అంశంపై జరిగన చర్చాగోష్ఠికి రిజీన్‌ ఇన్నోవేషన్స్‌ సహా వ్యవస్థాపకుడు ఉదయ్‌ సక్సేనా సమన్వయకర్తగా వ్యవహరించారు. సీసీఎంబీ డైరెక్టర్‌ వినయ్‌, ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌, టాటా మెడికల్‌ డయాగ్నోస్టిక్స్‌ సీఈవో గిరిష్‌ కృష్ణమూర్తి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ ఫ్రొఫెసర్‌ అశ్విని నంగియా.... బయోటెక్‌, ఫార్మా రంగాల్లో ఆవిష్కరణలపై చర్చించారు. కొవిడ్‌ మహమ్మారి తర్వాత... ఈ రంగాల్లో మన లోపాలు ఏమిటో తెలిశాయన్నారు. గతంతో పోలిస్తే ఫార్మా రంగంలో భారత్‌ గణనీయమైన వృద్ధి సాధిస్తోందని చెప్పారు. కొవిడ్‌ టీకాలు ఆవిష్కరించిన అతికొద్ది దేశాల్లో భారత్‌ కూడా భాగస్వామ్యం కావటం గమనార్హమన్నారు.

మంత్రి కేటీఆర్‌ హర్షం..

బయో ఆసియా సదస్సులో.... బీఎస్‌ బజాజ్‌ స్మారక ప్రత్యేక పురస్కారాన్ని బయోలాజికల్‌ ఇ లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల ప్రదానం చేశారు. ఫాబా జీవిత సాఫల్య పురస్కారాన్ని విశ్రాంత ఐఏఎస్​ అధికారి బీపీ ఆచార్యకు అందించారు. బయో ఆసియా 2022 సదస్సు విజయవంతం కావటంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. సదస్సులో బిల్‌గేట్స్‌తో చర్చించటం గొప్ప అవకాశమని తెలిపారు. సదస్సు నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.