ETV Bharat / business

ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటే నష్టమా? ఎన్ని ఉంటే మంచిది?

author img

By

Published : Jul 15, 2023, 10:39 AM IST

ఆర్ధిక లావాదేవీలను నిర్వహించుకోవడానికి ప్రతిఒక్కరూ ఒక బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండటం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

personal bank accounts
బ్యాంకు ఖాతాలు ఎక్కువ ఉంటే లాభమా నష్టమా

ఈ రోజుల్లో బ్యాంకు అకౌంట్ అనేది ప్రతీఒక్కరికీ అవసరమే. డబ్బులు పొదుపు చేసుకోవాలన్నా లేదా డబ్బులు వేరే వారికి పంపించుకోవాలన్నా, డబ్బులు వేరేవాళ్లు మనకు పంపాలన్నా బ్యాంకు అకౌంట్ తప్పనిసరిగా అవసరం. బ్యాంకు అకౌంట్ కలిగి ఉండటం వల్ల సులువుగా ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ యాప్స్ ద్వారా సులువుగా నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు పొందాలన్నా బ్యాంకు అకౌంట్ అవసరం ఉంటుంది.

అయితే చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటున్నారు. ఇలా ఎక్కువ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండటం మంచిదేనా..? లేకపోతే ఒక బ్యాంక్ అకౌంట్‌ ఉంటే సరిపోతుందా? అనే విషయంపై చాలామందికి అనుమానాలు ఉంటాయి. దీని గురించి ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

కనీసం ఒకటి కలిగి ఉండాలి..
ప్రతిఒక్కరూ కనీసం ఒక బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి. మీ జీతం పొందేందుకు, వివిధ బిల్లుల చెల్లింపులు, రోజువారీ ఖర్చుల కోసం ఈ ప్రాథమిక ఖాతాను ఉపయోగించాలి. ఈ ఖాతాకు ఆన్‌లైన్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల వంటి సేవలు కలిగి ఉండాలి. మీ ఆర్ధిక అవసరాలను బట్టి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు అవసరమా? లేదా? అనేది నిర్ణయించుకోవాలి.

పొదుపు ఖాతా అవసరం..
ప్రాథమిక్ అకౌంట్ కాకుండా సేవింగ్ అకౌంట్ ప్రత్యేకంగా కలిగి ఉండటం మంచిదని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ అకౌంట్‌లో భవిష్యత్తు అవసరాలకు కావాల్సిన డబ్బును దాచుకోవాలి. సేవింగ్స్ అకౌంట్‌లో మీరు డిపాజిట్ చేసిన డబ్బులపై వడ్డీ వస్తుంది. అంతేకాకుండా ఏటీఎం సేవలు లాంటి వాటిని ఉపయోగించుకోవచ్చు.

ఉమ్మడి ఖాతాతో లాభాలు..
ఇక మీరు జీవిత భాగస్వామి, లేదా కుటుంబాన్ని కలిగి ఉన్నట్లయితే ఉమ్మడి ఖాతాను తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల ఇద్దరూ ఆర్ధిక వ్యవహారాలను చూసుకోవచ్చు. ఇద్దరూ ఖర్చులను చూసుకోవడం, బిల్లులు చెల్లించడం, డబ్బులు ఆదా చేయడం సులువు అవుతుంది. అంతేకాకుండా ఆర్ధిక వ్యవహారాల పట్ల కుటుంబంలో పారదర్శకతను పెంచుతుంది.

శాలరీ అకౌంట్ వల్ల ఎన్నో ఉపయోగాలు..
మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నట్లయితే శాలరీ అకౌంట్ ప్రత్యేకంగా ఇస్తారు. దీని వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఇబ్బంది ఉండదు. ఎక్కువ నగదు లావాదేవీలు నిర్వహించే సౌలభ్యం, రుణం సులువుగా పొందే అవకాశంతో పాటు ఇంకెన్నో ఆఫర్లు శాలరీ ఖాతా కలిగిన వినియోగదారులకు బ్యాంకులు ప్రత్యేకంగా కల్పిస్తాయి.

పెట్టబడి పెడుతున్నారా..?
చాలామంది స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇందుకోసం ప్రత్యేక బ్యాంకు అకౌంట్‌ను కలిగి ఉండటం మంచిది. దీని వల్ల లాభనష్టాలను సులువుగా అంచనా వేసుకోవచ్చు. మీ ప్రాథమిక ఖాతాలో ఈ అకౌంట్‌ను జత చేసి ఉంచుకోవాలి. దీని వల్ల నిధులను వెంటనే బదిలీ చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.