కొరియన్ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ నూతనంగా కారు కొనే వినియోగదారులకు తీపి కబురు అందించింది. ఈ కంపెనీ తయారు చేసిన కొన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఏప్రిల్ నెలలోనే ఉండటం విశేషం. కొత్త కారు తీసుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి తరుణం!
గ్రాండ్ i10 నియోస్, ఆరా, ఐ20, వెన్యూ, వెర్నా, క్రెటా, టక్సన్, అల్కజార్ వంటి మోడళ్లపై డిస్కౌంట్ ప్రకటించింది హ్యుందాయ్. వీటితో పాటు అయోనిక్ 5, కోనా ఈవీ వంటి ఎలక్ట్రిక్ వాహనాలకు సైతం రాయితీ ఇవ్వనుంది. అయితే ఆయా వాహనాలపై నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో రూ.50 వేల వరకు తగ్గింపు అందిస్తుంది.
- పెట్రోల్‌తో నడిచే వాహనాలైన నియోస్, ఆరాపై రూ.23 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ.10 వేలు నగదు, రూ.10 వేలు ఎక్స్చేంజ్, మరో రూ.3 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో హ్యుందాయ్ ఇవ్వనుంది.
- సీఎన్‌జీ పవర్ ట్రెన్తో నడిచే ఇవే మోడళ్లపై రూ.20 వేల వరకు నగదు, రూ.10 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్, మరో రూ.3 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తోంది.
- ఐ20 మోడల్‌లో మాగ్న, స్పోర్ట్స్ వేరియంట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. వీటిపై రూ.10 వేల వరకు నగదు, రూ.10 వేల వరకు ఎక్స్చేంజ్ బెనిఫిట్లు ఉంటాయని కంపెనీ తెలిపింది.
- ఎన్ లైన్ మోడల్‌పై రూ.15 వేల వరకు అదనపు ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంది. తమ ఎలక్ట్రికల్ వాహనమైన కోనా ఈవీపై రూ.50 వేల వరకు ప్రయోజనాలు ఉంటాయని చెప్పింది.
- హ్యుందాయ్ వెన్యూ, వెర్నా, క్రెటా, టక్సన్, అల్కజార్ మోడళ్లపై ఈ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ వర్తించదని తెలిపింది.
ఈ డిస్కౌంట్‌కు అదనంగా.. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డీలర్లు తమ సొంత రాయితీలు, ప్రయోజనాలు కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది హ్యుందాయ్. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్లు తయారు చేస్తున్న కంపెనీల్లో హ్యుందాయ్ కూడా ఉంది. ప్రస్తుతం నడుస్తున్న ఎలక్ట్రిక్ కార్ల హవాలో ఈ సంస్థ ముందుంజలో ఉంది. త్వరలోనే కొనా అనే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
దక్షిణ కొరియాలో 1967లో ప్రారంభమైన హ్యుందాయ్.. అనతి కాలంలోనే ఆటో మొబైల్స్ రంగంలో మంచి పేరును సంపాదించుకుంది. ఈ కంపెనీకి మన దేశంలోనూ మంచి మార్కెట్ ఉంది. ముంబయి, చెన్నై, బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లోనూ షోరూమ్‌లు ఉన్నాయి. అనేక మంది ఈ కంపెనీ ఉత్పత్తులను వాడతారు.