ETV Bharat / business

మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలా? రూ.లక్ష బడ్జెట్​లో టాప్​-10 బైక్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 5:37 PM IST

Best Mileage Bike Under 1 Lakh In Telugu : మీరు మంచి మైలేజీ ఇచ్చే బైక్ కొందామని అనుకుంటున్నారా? మీ బడ్జెట్​ ఒక లక్ష రూపాయలు మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో రూ.1 లక్ష ధరలోపు మంచి మైలేజ్​ ఇచ్చే టాప్​ బ్రాండెడ్​ టూ-వీలర్స్​ ఉన్నాయి. వాటిలోని టాప్​-10 బైక్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

Popular Mileage Bikes in 2023
best mileage bike under 1 lakh

Best Mileage Bike Under 1 Lakh : నేటి కాలంలో బస్సులు, ఆటోలు లాంటి వాహనాల్లో షేరింగ్​ చేసుకుంటూ ప్రయాణించడం చాలా కష్టం అయిపోతోంది. పైగా టికెట్​ ధరలు కూడా రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. అందుకే చాలా మంది అందుబాటు ధరలో, మంచి మైలేజ్​ ఇచ్చే బైక్స్​ కొనేందుకు ఇష్టపడుతున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ టూ-వీలర్ కంపెనీలు అన్నీ మంచి స్టైలిష్ లుక్స్​తో, అదిరిపోయే ఫీచర్స్​, స్పెక్స్​తో.. ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్​లను తక్కువ ధరలో అందుబాటులోకి తెస్తున్నాయి. వాటిలోని టాప్​ -10 బైక్స్​ను ఇప్పుడు చూద్దాం.

Hero Splendor Plus XTEC Features : హీరో స్ల్పెండర్​ ప్లస్​ XTEC బైక్​లో 97 సీసీ ఇంజిన్​ను అమర్చారు. ఇది 8000 rpm వద్ద 8.02 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​లో 9.8 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్​కు ఏకంగా 95.8 కి.మీ మైలేజ్​ ఇస్తుంది.

Hero Splendor Plus XTEC Price : మార్కెట్లో ఈ హీరో స్ల్పెండర్ ప్లస్​ XTEC బైక్ ధర సుమారుగా రూ.80,511 వరకు ఉంటుంది.

Hero Splendor Plus XTEC
హీరో స్ప్లెండర్​ ప్లస్​ ఎక్స్​టీఈసీ

Hero Splendor Plus Features : ఈ హీరో స్ల్పెండర్​ ప్లస్​ బైక్​లోనూ 97 సీసీ ఇంజిన్​ను ఏర్పాటు చేశారు. ఇది 8000 rpm వద్ద 8.02 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​లోనూ 9.8 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్​కు 80.6 కి.మీ మైలేజ్​ ఇస్తుంది.

Hero Splendor Plus Price : మార్కెట్లో ఈ హీరో స్ల్పెండర్ ప్లస్​ బైక్ ధర రూ.75,891 నుంచి రూ.77.026 వరకు ఉంటుంది.

Hero Splendor Plus
హీరో స్ప్లెండర్​ ప్లస్​

Bajaj Platina 110 Features : బజాజ్ ప్లాటినా 110​ బైక్​లో 115 సీసీ ఇంజిన్​ను అమర్చారు. ఇది 7000 rpm వద్ద 8.60 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​లోనూ 10.5 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్​కు 70 కి.మీ మైలేజ్​ ఇస్తుంది.

Bajaj Platina 110 Price : బజాజ్ ప్లాటినా బైక్ రూ.71,174 నుంచి రూ.80,525 ప్రైజ్​ రేంజ్​లో ఉంటుంది.

Bajaj Platina 110
బజాజ్​ ప్లాటినా 110

TVS Sport Features : టీవీఎస్​ స్పోర్ట్​ బైక్​లో 109 సీసీ ఇంజిన్​ను​ పొందుపరిచారు. ఇది 7350 rpm వద్ద 8.29 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​లోనూ 10 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్​కు 70 కి.మీ మైలేజ్​ ఇస్తుంది.

TVS Sport Price : మార్కెట్లో టీవీఎస్​ స్పోర్ట్​ బైక్ ధర రూ.66,030 నుంచి రూ.71,220 మధ్య ఉంటుంది.

TVS Sport
టీవీఎస్​ స్పోర్ట్

Bajaj CT 110X Features : బజాజ్​ సీటీ 110 ఎక్స్​ బైక్​లో 115 సీసీ ఇంజిన్​ను అమర్చారు. ఇది 7000 rpm వద్ద 8.6 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​లోనూ 11 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్​కు 70 కి.మీ మైలేజ్​ ఇస్తుంది.

Bajaj CT 110X Price : బజాజ్​ సీటీ 110 ఎక్స్ బైక్ ధర సుమారుగా రూ.69,075 వరకు ఉంటుంది.

Bajaj CT 110X
బజాజ్​ సీటీ 110ఎక్స్​

Hero HF Deluxe Features : హీరో హెచ్​ఎఫ్​ డీలక్స్​​ బైక్​లో 97 సీసీ ఇంజిన్​ను​ ఏర్పాటు చేశారు. ఇది 8000 rpm వద్ద 8.02 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​లోనూ 9.6 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్​కు 70 కి.మీ మైలేజ్​ ఇస్తుంది.

Hero HF Deluxe Price : మార్కెట్​లో హీరో హెచ్ఎఫ్​ డీలక్స్ బైక్ రూ.65,498- రూ.69,598 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

Hero HF Deluxe
హీరో హెచ్​ఎఫ్​ డీలక్స్​

Bajaj Platina 100 Features : బజాజ్​ ప్లాటినా 100​ బైక్​లో 102 సీసీ ఇంజిన్​ను అమర్చారు. ఇది 7500 rpm వద్ద 7.9 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​లోనూ 11 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్​కు 70 కి.మీ మైలేజ్​ ఇస్తుంది.

Bajaj Platina 100 Price : బజాజ్​ ప్లాటినా 100 బైక్ ధర సుమారుగా రూ.68,819 వరకు ఉంటుంది.

Bajaj Platina 100
బజాజ్ ప్లాటినా 100

Hero HF 100 Features : హీరో హెచ్​ఎఫ్​ 100​ బైక్​లో 97 సీసీ ఇంజిన్​ను​ పొందుపరిచారు. ఇది 8000 rpm వద్ద 8.02 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​లోనూ 9.1 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్​కు 70 కి.మీ మైలేజ్​ ఇస్తుంది.

Hero HF 100 Price : హీరో హెచ్​ఎఫ్​ 100 బైక్ ధర సుమారుగా రూ.61,918 వరకు ఉంటుంది.

Hero HF 100
హీరో హెచ్​ఎఫ్​ 100

TVS Radeon Features : టీవీఎస్​ రేడియన్ బైక్​లో 109 సీసీ ఇంజిన్​ను​ అమర్చారు. ఇది 7350 rpm వద్ద 8.19 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​లోనూ 10 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్​కు 68.6 కి.మీ మైలేజ్​ ఇస్తుంది.

TVS Radeon Price : మార్కెట్లో టీవీఎస్ రేడియన్ బైక్ ధర రూ.74,125 నుంచి రూ.82,170 వరకు ఉంటుంది.

TVS Radeon
టీవీఎస్​ రేడియన్​

Hero Super Splendor XTEC Features : హీరో సూపర్​ స్ల్పెండర్​ XTEC​ బైక్​లో 124 సీసీ ఇంజిన్​ను అమర్చారు. ఇది 7500 rpm వద్ద 10.84 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​లోనూ 12 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. లీటర్​కు 68 కి.మీ మైలేజ్​ ఇస్తుంది.

Hero Super Splendor XTEC Price : మార్కెట్లో హీరో సూపర్​ స్ల్పెండర్ XTEC​ బైక్ ధర రూ.88,878 నుంచి రూ.93,078 మధ్య ఉంటుంది.

Hero Super Splendor XTEC
హీరో సూపర్ స్ప్లెండర్​ ఎక్స్​టీఈసీ

టాటా కార్​ కొనాలా? 2024లో లాంఛ్ కానున్న 5 బెస్ట్ మోడల్స్ ఇవే!

2024లో లాంఛ్ కానున్న టాప్-3 SUV కార్స్ ఇవే! ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.