ETV Bharat / business

బంగారంపై రుణాల పరిమితి భారీగా పెంపు

author img

By

Published : Aug 6, 2020, 5:04 PM IST

Updated : Aug 6, 2020, 7:43 PM IST

గురువారం ముగిసిన ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది ఆర్​బీఐ. అయితే కరోనా సమయంలో కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. బంగారంపై రుణాల నిబంధనలు సడలించింది. వాటితో పాటు ఆర్​బీఐ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

gold loans limit enhanced
బంగారంపై రుణాల పరిమితి పెంపు

కరోనా సంక్షోభం, వృద్ధి భయాలు, జూన్​లో ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో.. భారీ అంచనాలు మధ్య సమావేశమైన ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్​ రెపో రేటు 3.35 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది.

ఎంపీసీ కీలక నిర్ణయాలు:

  • కరోనా నేపథ్యంలో కుటుంబాలకు అండగా నిలిచేందుకు.. ప్రస్తుతం బంగారం విలువలో 75 శాతంగా ఉన్న రుణాల పరిమితి 90 శాతానికి పెంపు.
  • అవసరమైనప్పుడు వృద్ధిని ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సర జీడీపీ వృద్ధి ప్రతికూలమే
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనూ ద్రవ్యోల్బణం పెరగొచ్చు
  • 2020-21 రెండో ఆర్ధభాగం నుంచి సంక్షోభం నుంచి తెరుకునే అవకాశాలు ఉన్నాయి
  • రుణాల ఊబిలో చిక్కుకున్న ఎంఎస్​ఎంఈలకు.. షరత్తులతో కూడిన రుణాల పునర్​వ్యవస్థీకరణకు అనుమతి
  • కంపెనీలు, వ్యక్తిగత రుణ గ్రహీతలకు రుణాల పునర్​వ్యవస్థీకరణ కోసం ప్రత్యేక విండో ఏర్పాటు చేసేందుకు బ్యాంకులకు అనుమతి
  • ప్రయారిటీ సెక్టార్​ లెండింగ్ (పీఎస్​ఎల్​) పరిధిలోకి స్టార్టప్​లు
  • పీఎస్​ఎల్​ ద్వారా పునరుత్పాదక విద్యుత్, సోలార్​ పవర్​, తక్కువ ఆదాయం ఉన్న కంపెనీలు, బలహీన విభాగాలకు రుణాల పరిమితి పెంపు
  • వ్యవసాయ రంగానికి ప్రోత్సాహమందించేందుకు..నాబార్డ్​కు రూ.5,000 కోట్ల లిక్విడిటీ మద్దతు
  • హౌసింగ్ రంగంలో నగదు లభ్యత పెంచేందుకు నేషనల్ హౌసింగ్​ బ్యాంక్​ (ఎన్​హెచ్​బీ)కి రూ.5,000 కోట్ల అదనపు కేటాయింపు

ఇదీ చూడండి:బంగారం ధరలకు రెక్కలు- కిలో వెండి @75 వేలు

Last Updated : Aug 6, 2020, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.