ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

author img

By

Published : Nov 3, 2020, 5:32 PM IST

పసిడి, వెండి ధరలు మంగళవారం కూడా స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర అతి స్వల్పంగా రూ.50కి పైగా పెరిగింది. వెండి ధర కిలోకు రూ.61,800కు చేరువైంది.

Today gold rate
నేటి బంగారం ధర

బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.55 పెరిగి.. రూ.50,735 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా పుత్తడికి పెరిగిన డిమాండ్.. దేశీయంగా బంగారం ధర పెరిగేందుకు కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు స్వల్పంగా రూ.170 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.61,780 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,894 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 24 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:బ్యాంకింగ్ షేర్లు భళా- మళ్లీ 40వేల పైకి సెన్సెక్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.