ETV Bharat / business

Flipkart: ప్లాస్టిక్‌ రహిత డెలివరీ దిశగా ఫ్లిప్‌కార్ట్‌

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్.. ప్లాస్టిక్​ రహిత డెలివరీలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 70కి పైగా ఫుల్​ఫిల్​మెంట్ కేంద్రాల్లో ప్లాస్టిక్​ రహిత డెలివరీలు అందిస్తోంది.

Flipkart
ఫ్లిప్‌కార్ట్‌
author img

By

Published : Jul 7, 2021, 10:30 PM IST

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ 2021 నాటికి ప్లాస్టిక్‌ రహిత డెలివరీలు చేసే దిశగా అడుగువేసింది. దేశవ్యాప్తంగా 70కు పైగా ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాల్లో ప్లాస్టిక్‌ రహిత డెలివరీలు చేస్తోంది. ప్లాస్టిక్‌, పాలిథిన్‌లను పర్యావరణ హిత పేపర్‌, రీసైక్లింగ్‌ పేపర్‌ బ్యాగ్‌లతో భర్తీ చేస్తోంది. ఇక బబుల్‌ పేపర్‌ స్థానంలో కత్తిరించిన కాగితం ముక్కలు, 2ప్లే రోల్‌ వంటి వాటితో భర్తీ చేసింది.

'ఫ్లిప్‌ కార్ట్‌లో సుస్థిర, బాధ్యతాయుతమైన వ్యాపార విధానాలను అనుసరిస్తున్నాం. 100శాతం సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేస్తాం. పర్యావరణ హిత విధానాల అమలు దిశగా మేము వేసిన కీలక అడుగు ఇది. కొవిడ్‌ వ్యాప్తి వంటి క్లిష్ట సమయంలో మేము దీనిని సాధించాం. అటువంటి సమయంలో కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలను వదలకుండా అనుసరించిన మా బృందాలను అభినందిస్తున్నాము. ఇక మా విక్రేతలు కూడా ఈ విధానాన్ని అందిపుచ్చుకొనేట్లు ప్రోత్సహిస్తాం.

-- ఫ్లిప్‌కార్ట్‌

త్వరలోనే కస్టమర్ల ఆర్డర్లను నేరుగా సరఫరా చేసే ఫ్లిప్‌కార్టు భాగస్వామ్య విక్రేతలు కూడా ఈ విధానం అమలు చేసేట్లు అవగాహన కల్పించనుంది. ఇప్పటికే దాని విక్రేతల్లో 27శాతం మంది సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని వదిలేశారు. 15 శాతం ఉత్పత్తులకు మరో పొర ప్యాకింగ్‌ లేకుండా ఫ్లిప్‌కార్టు సరఫరా చేస్తోంది.

ఇదీ చదవండి : వాట్సాప్ ఇలా వాడుతున్నారా? అయితే బ్లాక్ అవ్వడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.