ETV Bharat / business

అన్నంత పని చేసిన మస్క్​- 9 లక్షల 'టెస్లా' షేర్లు విక్రయం..

author img

By

Published : Nov 11, 2021, 11:09 AM IST

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌.. తన ట్విట్టర్ అనుచరులు సూచించినట్లే టెస్లా షేర్లను విక్రయించారు. పన్ను చెల్లించేందుకు 1.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,187 కోట్లు) విలువైన 9 లక్షల షేర్లను విక్రయించారు.

Elon musk
ఎలాన్‌ మస్క్‌

ప్రపంచ కుబేరుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. టెస్లా షేర్ల అమ్మకంపై తన ట్విట్టర్ ఖాతా అనుచరుల్లో మెజారిటీ నిర్ణయానికే మొగ్గుచూపారు. పన్ను చెల్లించేందుకు 1.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,187 కోట్లు) విలువైన 9 లక్షల షేర్లను విక్రయించారు. ట్విట్టర్‌ పోల్‌లో 58 శాతం మంది వాటాలు విక్రయించమనే సూచించడం వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ లావాదేవీల అనంతరం కూడా దాదాపు 170 మిలియన్ టెస్లా షేర్లు మస్క్​ వద్ద ఉన్నాయి.

అయితే సోమ, మంగళవారాల్లో టెస్లా షేర్లు వరుసగా పతనమయ్యాయి. దీంతో ఎలన్‌ మస్క్‌ ఆస్తి రెండు రోజుల్లో 50 బిలియన్‌ డాలర్లు కరిగిపోయింది. బ్లూమ్‌ బెర్గ్‌ బిలియనీర్ల ఇండెక్స్‌ చరిత్రలోనే అతిపెద్ద రెండు రోజుల పతనంగా నమోదైంది.

టెస్లా షేర్ల పతనానికి మస్క్‌ ట్వీట్లు కూడా ఓ కారణమే. దీనికి తోడు ఈ పోల్‌ పెట్టడానికి ముందే మస్క్‌ సోదరుడు కింబల్‌ టెస్లాలోని వాటాలను విక్రయించినట్లు సమాచారం. దీంతో టెస్లా షేర్ల ధర పతనమైంది. అయితే బుధవారం పుంజుకున్న టెస్లా షేరు ధర 1,067.95 డాలర్లకు చేరింది.

ఇదే కారణం..

టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సహా మరికొన్ని కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఎలాన్‌ మస్క్‌ నగదు రూపంలో జీతభత్యాలు(Elon Musk Salary) తీసుకోరు. కేవలం స్టాక్‌ ఆప్షన్స్‌ మాత్రమే స్వీకరిస్తారు. అంటే రాయితీ ధరతో కూడిన స్టాక్సే ఆయన వేతనం. అలా ఆయన ఖాతాలో ఉన్న 22.86 మిలియన్ల టెస్లా స్టాక్‌(Elon Musk Tesla Stock) ఆప్షన్స్‌కు వచ్చే ఏడాది ఆగస్టు 13 నాటికి కాలం చెల్లనుంది. ఆలోపు ఆయన వాటిని ముందు నిర్ణయించిన 6.24 డాలర్లకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా వీటిపై వచ్చే ఆదాయాన్ని మూలధన లాభం కింద లెక్కగడతారు. దీనిపై మస్క్‌ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన షేర్లను విక్రయించాలని నిర్ణయించుకున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.