ETV Bharat / briefs

'మోదీ విష సర్పం.. టచ్​ చేస్తే మీ పని అంతే!'.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు.. కాసేపటికే..

author img

By

Published : Apr 27, 2023, 5:33 PM IST

Updated : Apr 27, 2023, 6:36 PM IST

ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ విష సర్పం లాంటి వారని మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. ఆ విష సర్పాన్ని ముట్టుకుంటే చనిపోతారన్నారు. దీంతో ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖర్గేతోపాటు కాంగ్రెస్​ పార్టీ..​ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. కాసేపటికే ఖర్గే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. అసలేం జరిగిందంటే?

Kharge comments on Modi
మోదీపై ఖర్గే వ్యాఖ్యలు

భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. కర్ణాటక ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, బీజేపీ శ్రేణులు ఖర్గే వ్యాఖ్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ పార్టీతో పాటు ఖర్గే దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలపై ఖర్గే వివరణ ఇచ్చుకున్నారు.

మోదీపై ఖర్గే వ్యాఖ్యలు..
మోదీ విష సర్పం లాంటి వారని మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. "ఆ పాముకు విషం ఉందో లేదోనని మీరు అనుకోవచ్చు. ఒకవేళ దానిని టచ్​ చేస్తే.. మీరు చనిపోతారు" అని ఖర్గే ఆరోపణలు గుప్పించారు. గురువారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖర్గే.. కలబురగి జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్​ అధ్యక్షుడి వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ
ఖర్గే వ్యాఖ్యలపై.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తీవ్రంగా మండిపడ్డారు. ఖర్గే మెదడులోనే విషం ఉందని ఆరోపించారు. బీజేపీ, మోదీపై కాంగ్రెస్​కు ఉన్న పక్షపాత ధోరణికి ఇది నిదర్శనమన్నారు. నిరాశతోనే కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ మునిగిపోయే పడవలాంటిదన్న బొమ్మై.. మోదీని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు వాళ్లకు గుణపాఠం చెబుతారని బొమ్మై విమర్శించారు.

ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ సైతం మండిపడ్డారు. దేశానికి కాంగ్రెస్​తో పాటు ఖర్గే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలు.. ప్రధానిపై గాంధీ కుటుంబ అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. "ఖర్గే వాఖ్యలను బీజేపీ భావాజాలన్ని ఉద్దేశించినవి ఆయన వివరణ ఇచ్చారు. దేశం ఫస్ట్​ అనే భావాజాలం బీజేపీ పార్టీది" అని స్మృతి ఇరానీ అన్నారు. ఇది మోదీపై దాడి కాదని.. దేశంపై దాడి అని విమర్శించారు.

బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి శోభా కరన్​ద్లాజే సైతం.. ఖర్గే వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. ఖర్గే.. ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. నరేంద్ర మోదీ మన దేశానికి ప్రధానమంత్రి అని.. ఆయనను ప్రపంచమంతా గౌరవిస్తుందని శోభా కరన్​ద్లాజే అన్నారు. అటువంటి వ్యక్తిపై ఖర్గే ఈ తరహాలో మాట్లాడటం వల్ల.. కాంగ్రెస్​ ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతుందన్నారు. ఖర్గే చేసిన వ్యాఖ్యల వీడియోను బీజేపీ శ్రేణులు సోషల్​ మీడియాలో షేర్​ చేస్తు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఖర్గే వివరణ..
తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడం వల్ల.. వాటిపై మల్లిఖార్జున ఖర్గే వివరణ ఇచ్చుకున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాదన్నారు. కేవలం బీజేపీ భావజాలాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేన్నారు. "బీజేపీ భావజాలం పాము లాంటిది. తాన్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తే చనిపోయే ప్రమాదం ఉంది" అని తాను అన్నానని ఖర్గే సృష్టం చేశారు. తాను మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్న ఖర్గే.. తాను వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచేలా మాట్లాడని ఇంతకముందే చెప్పానని గుర్తు చేశారు.

Last Updated : Apr 27, 2023, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.