ETV Bharat / bharat

మహిళ నామినేషన్​ తిరస్కరణ.. మొదటి భర్త వల్లే!

author img

By

Published : Apr 10, 2021, 4:39 PM IST

UP panchayat polls: Woman's nomination rejected for village head as papers show her first husband's name
నామినేషన్​లో మొదటి భర్త పేరు.. తిరస్కరణ

ఉత్తర్​ప్రదేశ్​ పంచాయతీ ఎన్నికల్లో సరైన పత్రాలు లేని కారణంగా ఓ మహిళ నామినేషన్​ తిరస్కరణకు గురైంది. ఆమె పత్రాల్లో ప్రస్తుత భర్త పేరు ఉండగా.. ఓటర్​ లిస్ట్​లో మాత్రం మొదటి భర్త పేరు ఉండటమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.

ఉత్తర్​ప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ఓ మహిళ నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. పుర్కాజీ బ్లాక్​ పరిధిలో సర్పంచి అభ్యర్థిగా పోటీలో నిలిచిన సోనియా అనే ఆ అభ్యర్థి పత్రాలపై ప్రతీచోటా ఆమె రెండో భర్త సతేంద్ర పేరు ఉంది. అయితే ఓటర్​ లిస్ట్​లో మాత్రం ఆమె మొదటి భర్త దేవేందర్​ పేరు ఒక్కటే ఉంది. ఇదే కారణంతో నామినేషన్​ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి ఆర్.కె శ్రీవాస్తవ తెలిపారు.

ఆ మహిళ మొదట దేవేందర్​ను పెళ్లాడింది. ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోయాక.. దేవేందర్​ సోదరుడు సత్యేందర్​ను పెళ్లి చేసుకుంది.

ఇదీ చదవండి: రూ.3 కోట్ల బీమా కోసం.. కారులోనే భర్తను కడతేర్చి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.