ETV Bharat / bharat

మీ వాట్సాప్ చాటింగ్​లను ప్రభుత్వం చదువుతోందా, ఇదిగో క్లారిటీ

author img

By

Published : Aug 22, 2022, 8:26 PM IST

వాట్సాప్‌లో వాట్సాప్​పైనే నకిలీ వార్త చక్కర్లు కొట్టింది. చాటింగ్​లను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందంటూ నకిలీ వార్త సృష్టించారు. ఈ ఘటనపై ప్రభుత్వ విభాగాలు స్పందించాయి.

Etv BharatWhatsapp fake messages
Whatsapp on fake messages

వాట్సాప్‌ చాటింగ్‌లను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసిందనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో ఇటీవల విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచారశాఖలోని పీఐబీ విభాగం స్పందించింది. అలాంటి మార్గదర్శకాలేవీ ప్రభుత్వం విడుదల చేయలేదని స్పష్టం చేసింది. అది నకిలీ మెసేజ్‌ అని పేర్కొంది.

'వాట్సాప్‌ మెసేజ్‌లను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతోన్న మెసేజ్‌ నకిలీది. అటువంటి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయలేదు' అని కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం స్పష్టం చేసింది.

'వాట్సాప్‌లో మెసేజ్‌ పంపిస్తే ఒక టిక్‌ గుర్తు, అవతలివారికి చేరితే రెండు టిక్‌లు, 2 బ్లూకలర్‌ టిక్‌లు ఉంటే మెసేజ్‌ చదివారని.. మూడు బ్లూ టిక్‌ గుర్తులు ఉంటే ప్రభుత్వం వాటిని గమనించిందని.. రెండు బ్లూ, ఒక రెడ్‌ టిక్‌ మార్క్‌ ఉంటే ప్రభుత్వం మీపై చర్యలు తీసుకోనుందని.. అదే ఒకటి బ్లూ, రెండు రెడ్‌ టిక్‌లు ఉంటే మీ సమాచారాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని.. మూడు రెడ్‌ కలర్‌లో ఉంటే ప్రభుత్వం మీపై చర్యలకు ఉపక్రమించిందని, వీటికి సంబంధించి త్వరలోనే మీకు కోర్టు నుంచి సమన్లు జారీ అవుతాయి' అని పేర్కొంటూ ఒక మెసేజ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇదిలాఉంటే, వాట్సాప్‌లో ఇటువంటి మెసేజ్‌లపై 'మెటా' సంస్థ ఇప్పటికే పలుసార్లు క్లారిటీ ఇచ్చింది. వాట్సాప్‌లో మెసేజ్‌లు పూర్తి సురక్షితమని వారిని ఎవ్వరూ చదవలేరని స్పష్టం చేసింది. అంతేకాకుండా వాట్సాప్‌ సంస్థ కూడా వాటిని చదివే ఆస్కారం లేదని తెలిపింది.

ఇవీ చూడండి: డబ్బు ఆశతో క్షుద్రపూజలు, భార్యకు అందరిముందు నగ్నంగా స్నానం చేయించి

మద్యం మత్తులో స్నేహితుల అరాచకం, మలద్వారంలో గ్లాసు చొప్పించి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.