ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాణిగంజ్ నియోజకవర్గంలో చేపడుతున్న ఓ కళాశాల భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలను ఎండగట్టారు అక్కడి సమాజ్‌వాదీ ఎమ్మెల్యే డా.ఆర్కే వర్మ. గురువారం క్షేత్రస్థాయిలో తనిఖీకి వచ్చిన ఆయన.. కేవలం చేత్తో నెడితేనే కూలిపోతున్న ఆ నిర్మాణాల వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇది నాలుగు అంతస్తుల ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ భవన నిర్మాణమని పేర్కొన్నారు.
-
ऐसे घटिया निर्माण कार्य से सरकार युवाओं का भविष्य नहीं तैयार रही,यह उनके मौत का इंतजाम है, रानीगंज विधानसभा में बन रहे इंजीनियरिंग कॉलेज में भ्रष्ट सरकारी तंत्र का दर्शन। pic.twitter.com/Rr6ibkN4l4
— Dr. R. K. Verma mla (@DrRKVermamla2) June 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ऐसे घटिया निर्माण कार्य से सरकार युवाओं का भविष्य नहीं तैयार रही,यह उनके मौत का इंतजाम है, रानीगंज विधानसभा में बन रहे इंजीनियरिंग कॉलेज में भ्रष्ट सरकारी तंत्र का दर्शन। pic.twitter.com/Rr6ibkN4l4
— Dr. R. K. Verma mla (@DrRKVermamla2) June 23, 2022ऐसे घटिया निर्माण कार्य से सरकार युवाओं का भविष्य नहीं तैयार रही,यह उनके मौत का इंतजाम है, रानीगंज विधानसभा में बन रहे इंजीनियरिंग कॉलेज में भ्रष्ट सरकारी तंत्र का दर्शन। pic.twitter.com/Rr6ibkN4l4
— Dr. R. K. Verma mla (@DrRKVermamla2) June 23, 2022
"ఇటువంటి నాసిరకం పనులతో ప్రభుత్వం.. యువత భవిష్యత్తును నిర్మించడం లేదు. వారి మరణానికి ఏర్పాట్లు చేస్తోంది. రూ.కోట్ల వ్యయంతో చేపడుతున్న పనుల్లో అవినీతి.. ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. దీనిపై విచారణ జరిపించాలి."
- డా.ఆర్కే వర్మ, రాణిగంజ్ ఎమ్మెల్యే
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం శుక్రవారం ట్విటర్ వేదికగా సంబంధిత వీడియో పంచుకున్నారు. అవినీతిపై అధికార భాజపాను లక్ష్యంగా చేసుకున్నారు. 'భాజపా పాలనలో అవినీతి అద్భుతం. సిమెంట్ లేకుండానే కళాశాల నిర్మాణంలో ఇటుకలు పేర్చారు' అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పనుల్లో నాణ్యతాలేమిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు సంబంధిత అధికారులు.. నిర్మాణ సామగ్రి నమూనాలు సేకరించి, తనిఖీలకు పంపారు.
ఇదీ చూడండి: మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు!