ETV Bharat / bharat

త్రిముఖపోరులో ప్రధాన పార్టీల హోరాహోరీ-విజయ బావుటా ఎగురవేసేదెవరో!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 6:25 AM IST

Three Way Fight in Telangana Assembly Election : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అగ్ర పార్టీలన్నీ తమదైన వ్యూహాలతో దూసుకెళుతున్నాయి. ఓట్లు చీలకుండా గంపగుత్తగా తమకే పడేలా అన్ని రాజకీయ పక్షాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ సామాజికవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. ఓట్లన్నీ కొల్లగొట్టే వ్యూహాలు రచిస్తోంది. అధికార పార్టీ ఆధిపత్యానికి గండి కొట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా కాంగ్రెస్‌ అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ సైతం బీసీ నినాదంతో జనాభాలో ఎక్కువ శాతం ఉన్న వెనకబడిన వర్గాల ఓట్లను ఒడిసిపట్టే ఎత్తుగడతో పనిచేస్తోంది.

BRS Political Moves in TS Elections
Three Way Fight in Telangana Assembly Election
త్రిముఖపోరులో ప్రధాన పార్టీల హోరాహోరీ-విజయ భావుటా ఎగురవేసేదెవరో!

Three Way Fight in Telangana Assembly Election : రాష్ట్ర శాసనసభ ఎన్నికలు త్రిముఖ పోరుకు వేదికవుతున్నాయి. పదేళ్లుగా పాలిస్తున్న గులాబీ పార్టీ ముచ్చటగా మూడోసారి గెలిచి పీఠాన్ని అధిష్ఠించాలని ప్రయత్నిస్తోంది. అధికారం నిలుపుకోవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు. ప్రతిపక్షాలకు(Opposition Party) ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. పదునైన వ్యూహాలతో ప్రతిపక్షాలకు చెక్‌ పెట్టాలని చూస్తున్నారు.

BRS Political Moves in TS Elections : రాజకీయంలో ఉన్న అపార అనుభవంతో విపక్షాలను అంతర్మథనంలో పడేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటర్ల దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజల ఓట్లను కొల్లగొట్టే ఉద్దేశంతో సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఆయా వర్గాలకు చేరువయ్యేలా హామీలు గుప్పిస్తున్నారు. మహిళా, యువజన, రైతులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. అంబేడ్కర్‌(B.R Ambedkar) ఆశయాలకు అనుగుణంగా పదేళ్లు ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేసిందని ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

BRS on Congress Comments : 'రైతుల శత్రువు కాంగ్రెస్.. ఫ్రీ కరెంట్​పై ఆ పార్టీది దుర్మార్గపు ఆలోచన'

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను పార్టీలకు అతీతంగా కుల, మత భేదం లేకుండా అన్ని వర్గాలకు అందించామని వివరిస్తున్నారు. తటస్థ ఓటర్ల మద్దతు కోసం పదేళ్లలో చేసిన ప్రగతి పనులను సమగ్రంగా వివరిస్తున్నారు. సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో ప్రాంతీయ భేదం ఎక్కడా చూపలేదని గుర్తుచేస్తున్నారు. తద్వారా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అధికంగా ఉన్న సెటిలర్ల ఓట్లను తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

BRS Manifesto in Assembly Election : పోల్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన గులాబీ పార్టీ రాష్ట్రంలో పురుషులతో సమానంగా ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ఎన్నికల ప్రణాళికను(Election Planning) రూపొందించింది. పార్టీ మ్యానిఫెస్టోలో అతివలకు అగ్రతాంబూలం ఇచ్చింది. ఒంటరి స్త్రీలకు ఆసరా పెన్షన్‌, అర్హులైన వారికి మూడు వేల భృతి, 400లకే గ్యాస్‌ బండ, మహిళాసంఘాలకు భవనాలు, ఇళ్ల స్థలాలను సైతం నారీమణులకే ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. మహిళలు ప్రతిపక్షాల వైపు మళ్లకుండా ప్రతి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో వారినే ముందుంచుతున్నారు.

గడపగడపకు వెళ్లి ఆడవాళ్లను పలకరించేలా క్షేత్రస్థాయిలో గులాబీ నేతలు పనిచేస్తున్నారు. పదేళ్లలో చేసిన పనులతో పాటు గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో మహిళా అభ్యున్నతికి చేసే పనులు వివరిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను బలంగా ఉపయోగించుకుని ప్రభుత్వం పదేళ్లలో చేసిన పనుల వివరాలు ప్రజలకు చేరేలా ప్రత్యేక కార్యచరణతో పనిచేస్తున్నారు. ప్రచారానికి సోషల్‌ మీడియా(Social Media) ఇన్‌ఫ్లూయెన్సర్లను ఉపయోగించుకుని నిమిషం నిడివితో రీల్స్‌ చేయించి ఓటర్లకు చేరేలా చూస్తున్నారు. బూత్‌స్థాయి సమావేశాల్లో ప్రతీ ఓటరును ప్రచారం ముగిసేలోపు మూడుసార్లు కలవాలని ముఖ్యనేతలు సూచిస్తున్నారు. ప్రతీ నియోజకవర్గం, మండల, గ్రామస్థాయిలో సోషల్‌ మీడియా సమన్వయకర్తలను నియమించుకుని ప్రచారంలో పట్టుజారకుండా అగ్రనేతలు నిరంతంరం పర్యవేక్షిస్తున్నారు.

Congress Strategies in Assembly Election : ప్రధాన విపక్షం కాంగ్రెస్‌.. గులాబీ పార్టీ ఆధిపత్యానికి గండి కొట్టే వ్యూహాలను రచిస్తోంది. టికెట్ల ఖరారు కాస్త ఆలస్యమైనా.. ఆ ప్రభావం క్షేత్రస్థాయిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చిన్నా చితక పార్టీలతో సంప్రదింపులు చేసి మద్దతు కూడగడుతోంది. ఆ క్రమంలో షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్​టీపీ, కోదండరాం తెలంగాణ జనసమితి(TJS Party) సంఘీభావం లభిస్తుందని హస్తం పార్టీ నేతలు అంచనావేస్తున్నారు. మూడు విడతల్లో టికెట్‌ రాని అసంతృప్తులను సముదాయిస్తున్న కాంగ్రెస్‌ పెద్దలు మిగతా పార్టీల మద్దతుపైనా దృష్టి సారించారు.

'బీఆర్ఎస్ నాయకులకు అధికారులు కొమ్ము కాస్తున్నారు'

పార్టీ తిరుగుబాటుదారులు, స్వతంత్రులు ఎక్కువగా పోటీ చేయకుండా బుజ్జగిస్తూనే.. సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టే యజ్ఞంలో కలిసిరావాలని కోరుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో పార్టీలో చాలాకాలం పనిచేస్తున్న వారికి కాకుండా కొత్తవారికి టికెట్లు దక్కాయి. కొంతమంది అసమ్మతిరాగాన్ని బాహాటంగానే ప్రకటిస్తున్న తరుణంలో వారు పార్టీ వ్యతిరేకంగా పనిచేయకుండా సీనియర్‌ నేత జానారెడ్డి(Senior leader Jana Reddy) నేతృత్వంలోని నలుగురు సభ్యుల సమన్వయ కమిటీ పనిచేస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పోటీకి విముఖత చూపగా.. వైఎస్ఆర్​టీపీ, టీజేఎస్ మద్దతు పలకడం కాంగ్రెస్‌ నాయకుల్లో ఉత్సాహం నింపుతోంది.

Congress Six Guarantee Campaign : బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకీకరణ జరగాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అందర్నీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండు సార్లు అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్‌ ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌ సైతం ప్రచారంలో పదేళ్లలో అమలు చేయని హామీలను ఏకరవు పెట్టడమే కాక.. ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. సోషల్‌ మీడియాలోనూ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు బృందం నిర్దేశంలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. ఉచిత విద్యుత్‌(Free Current), ధరణి, రైతుబంధుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను బలంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కేసీఆర్​ చెంప చెళ్లుమనేలా- కాంగ్రెస్​ పార్టీ పక్షానే ప్రజల ప్రయాణం : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

BC Slogan of BJP in Telangana Assembly Election : రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న ఓబీసీల ఓట్లను ఒడిసిపట్టే వ్యూహంతో బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ఇప్పటికే కమలం అగ్రనేత అమిత్‌షా ప్రకటించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటి కాదనే వాదనను ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ప్రతి విమర్శలకు పదనుపెడుతోంది. రాష్ట్రానికి పసుపు బోర్డు, వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌, రైల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఇచ్చామని.. అంతేగాకుండా ఎన్నో పథకాల ద్వారా నిధులు అందించినట్లు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా వెనకబడిన వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. జనసేన(Janasena Party) రూపంలో బీజేపీ సైతం సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం ఓట్లపై గురి పెట్టింది.

తెలంగాణలో 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరే

కాంగ్రెస్​ గూటికి విజయశాంతి! - నేడో, రేపో చేరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.