ETV Bharat / bharat

Drugs news: డ్రగ్స్​ కేసులో షారుక్ ఖాన్​ తనయుడు అరెస్ట్​

author img

By

Published : Oct 3, 2021, 12:29 PM IST

Updated : Oct 3, 2021, 8:00 PM IST

ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్​ పార్టీలో (Mumbai Rave Party news) పట్టుబడ్డవారిలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Mumbai Rave Party Superstar Son) సైతం ఉన్నాడు. అతడిని ఇప్పటికే ముంబయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్​సీబీ) (Drugs news) అధికారులు అరెస్టు చేశారు. ఆర్యన్​ను ప్రశ్నించిన అనంతరం.. వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టులో ప్రవేశపెట్టగా.. రేపటివరకు ఎన్​సీబీ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

SRK's son Aryan Khan being questioned in Mumbai cruise drugs case
షారుక్ తనయుడు డ్రగ్స్ పార్టీ కేసు

పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్న అధికారులు

ముంబయి రేవ్ పార్టీలో (Mumbai Rave party) పట్టుబడిన వారిలో బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (Mumbai Rave Party Superstar Son) సైతం ఉన్నాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Drugs news) స్పష్టం చేసింది. (Mumbai Rave Party news) పార్టీలో అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది వివరాలను ఎన్​సీబీ వెల్లడించింది. (Shah Rukh Khan son drugs) అనంతరం.. షారుక్​ తనయుడిని అరెస్టు చేసింది. ఇతడిని కోర్టులో ప్రవేశపెట్టగా.. రేపటివరకు ఎన్​సీబీ కస్టడీకి అప్పగించింది.

ఆర్యన్ ఖాన్​తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్​మున్ ధమేచ, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జైశ్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రాలను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి(Mumbai Rave Party 2021) ఎన్​సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తెలిపారు. వీరిని ప్రశ్నించిన అనంతరం.. వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఎన్​డీపీఎస్​ సెక్షన్‌ 27 ప్రకారం వారిపై కేసు నమోదు చేసిన ఎన్​సీబీ అధికారులు.. తిరిగి కార్యాలయానికి తీసుకొచ్చారు.

నిఘా వేసి...

డ్రగ్స్ పార్టీ (Mumbai Rave Party on Cruise) జరుగుతోందన్న సమాచారంతో శనివారం రాత్రి ముంబయి తీరం నుంచి బయల్దేరిన క్రూయిజ్ నౌకపై ఎన్​సీబీ (Drugs news) ప్రత్యేక నిఘా పెట్టింది. సమీర్ వాంఖెడే నేతృత్వంలో పలువురు ఎన్​సీబీ అధికారులు ప్రయాణికుల్లా నౌకలోకి ప్రవేశించి.. రేవ్ పార్టీ గుట్టురట్టు చేశారు. ముంబయి నుంచి గోవాకు ఈ నౌక ప్రయాణిస్తోందని అధికారులు తెలిపారు. సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత పార్టీ ప్రారంభమైందని చెప్పారు. పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకొని ముంబయికి తరలించినట్లు వెల్లడించారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఎన్​సీబీ.

aryan khan drugs case
షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్

రెండు వారాలుగా...

ఈ ఇన్వెస్టిగేషన్ పక్కా ప్రణాళికతో జరిగిందని ఎన్​సీబీ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. రెండు వారాల నుంచి దీనిపై పనిచేస్తున్నట్లు చెప్పారు. నిఘా వర్గాలు అందించిన నిర్దిష్ట సమాచారాన్ని వినియోగించి ఈ పార్టీ గుట్టురట్టు చేసినట్లు వివరించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్​ తారలతో ఉన్న లింకులు బయటపడ్డట్లు తెలిపారు.

అనంతరం తనిఖీలు నిర్వహించి డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాలను అనుమానితులు తమ దుస్తులు, లోదుస్తులు, పర్సులలో దాచేసుకున్నారని చెప్పారు. అదుపులోకి తీసుకున్నవారందరినీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు ఎన్​సీబీ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: మాదకశక్తులతో దేశ భవితవ్యం ఛిన్నాభిన్నం

Last Updated : Oct 3, 2021, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.